Love Affair: డెలివరీ కోసం పుట్టింటికి వెళ్లిన యువతి.. యువకుడు ఆత్మహత్యాయత్నం

సూర్యాపేట జిల్లాలో యువకుడి ఆత్మహత్యాయత్నం కలకలం సృష్టిస్తోంది. ప్రేమించిన యువతి డెలివరీ కోసం పుట్టింటికి వెళ్లిన సమయంలో యువకుడు సెల్ఫీ వీడియో తీసి ఆత్మహత్యాయత్నం చేశాడు.

Update: 2024-08-15 14:57 GMT

దిశ, వెబ్‌డెస్క్ : సూర్యాపేట జిల్లాలో యువకుడి ఆత్మహత్యాయత్నం కలకలం సృష్టిస్తోంది. ప్రేమించిన యువతి డెలివరీ కోసం పుట్టింటికి వెళ్లిన సమయంలో యువకుడు సెల్ఫీ వీడియో తీసి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆత్మకూర్ (ఎస్) మండలం కోటినాయక్ తండాలో ఈ ఘటన వెలుగు చూసింది. స్థానికుల సమాచారం ప్రకారం.. కోటినాయక్ తండాకు చెందిన విజయ్ చివ్వెంల మండలం గుర్రంతండాకు చెందిన యువతి గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో ఏడాది క్రితం ఇద్దరు కలిసి ప్రేమ వివాహం చేసుకున్నారు. యువతి గర్భం దాల్చడంతో పురుడు కోసం పుట్టింటికి వెళ్లింది. అయితే అమ్మాయి తరుఫు బంధువులు విజయ్‌పై దాడి చేసినట్లు గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఈ ఘటనతో తీవ్ర మనస్థాపం చెందిన విజయ్.. ఇవాళ మధ్యాహ్నం సెల్ఫీ వీడియో తీసుకుంటూ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. తనను తీవ్రంగా అవమానించారని సెల్ఫీ వీడియోలు పేర్కొన్నట్లు సమాచారం. యువకుడిని గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి చికిత్స నిమిత్తం సూర్యాపేటకు తరలించారు. కాగా, విజయ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నట్లు తెలిసింది. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.


Similar News