ఆశ చూపి కుచ్చు టోపీ

సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. తక్కువ పెట్టుబడి తో అధిక

Update: 2024-07-08 15:57 GMT

దిశ, సిద్దిపేట ప్రతినిధి : సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. తక్కువ పెట్టుబడి తో అధిక లాభాలు వస్తాయని నమ్మ పలికి ఓ బాధితుడిని సైబర్ నేరస్థుడు మోసం చేశాడు. సంఘటన సిద్దిపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...స్టాక్ మార్కెట్ లింక్ ను ఓ బాధితుడికి పంపించి పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు వస్తాయని నమ్మ పలికాడు. రెండు, మూడు సార్లు స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టగా లాభాలు వచ్చాయి.

అదే ఆశతో గత 20 రోజులుగా సైబర్ నేరగాడు పంపించిన లింక్ ఓపెన్ చేసి నీఫరో కేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ షేర్స్ కొనడానికి రూ. 80,60,000 పెట్టుబడి పెట్టాడు. రెండు మూడు రోజుల తర్వాత లింక్ ఓపెన్ చేయగా షేర్ మార్కెట్ లింక్ బ్లాక్ చేసి ఉంది. అనుమానం వచ్చిన బాధితుడు సిద్దిపేట సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా ఏసీపీ శ్రీనివాస్ కేసు నమోదు చేసి సైబర్ నేరస్తుడి అకౌంట్ లో ఉన్న రూ.11,00,010 డబ్బులను ఫ్రిజ్ చేయించారు. సైబర్ నేరం జరిగిన వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1930 కు కాల్ చేస్తే డబ్బులు రికవరీ అవకాశం ఎక్కువగా ఉంటుందని పోలీస్ కమిషనర్ డా అనురాధ పేర్కొన్నారు.


Similar News