నలబై ఏళ్లుగా గంజాయి దందా.. 157 కిలోల గంజాయితో దొరికిన ఘరానా స్మగ్లర్

Update: 2023-09-25 11:07 GMT

దిశ, నిజామాబాద్ క్రైం: నిజామాబాద్ జిల్లాలో గత నలబై సంవత్సరాలుగా గంజాయి రవాణా క్రయ విక్రయాలు చేస్తున్న గంజాయి స్మగ్లర్ ఎట్టకేలకు అబ్కారి శాఖకు చిక్కారు. నిజామాబాద్ ఎక్సైజ్ ఎన్ పోర్స్ మెంట్ అసిస్టెంట్ కమీషనర్ ఆర్. కిషన్ సోమవారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మహరాష్ర్ట నుంచి నిజామాబాద్‌కు గంజాయి రవాణా అవుతుందని విశ్వసనీయ సమాచారం మేరకు అదివారం రాత్రి నవిపేట్ రైల్వే గైట్ ప్రాంతంలో ఇద్ధరు ప్రయాణిస్తున్న మహీంద్రా కారును ఎన్‌పోర్స్‌మెంట్ అధికారులు పట్టుకున్నారు. కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలం యాచారం గ్రామానికి చెందిన బానోత్ వసంత్ రావు, కామారెడ్డి మండలానికి చెందిన ప్రవిణ్ లను పట్టుకున్నారు. వారు ప్రయాణిస్తున్న కారులో 157 కిలోల ఎండు గంజాయి ఉందని గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల కాలంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో క్వింటాళ్‌కు పైగా గంజాయి దోరకడం మొదటి సారి అని తెలిపారు.


బానోత్ వసంత్ రావు మహరాష్ట్ర , ఓడిస్సా ప్రాంతాల నుంచి గంజాయిని తీసుకువచ్చి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో విక్రయాలు చేస్తున్నాడని కిషన్ తెలిపారు. ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు వసంత్ రావు పైన ఒక్క కేసు లేకపోవడం ఆశ్చర్యం వేస్తుందని అన్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకోవడంలో ఎక్సజ్ ఇన్స్‌పెక్టర్ లు స్వప్న, రామ్ కుమార్ లతో పాటు సిబ్బంది నారాయాణ రెడ్డి, ఉత్తమ్‌లను ఆయన అభినందించారు. నిజామాబాద్ డీప్యూటీ పోలిస్ కమీషనర్ దశరధ, నిజామాబాద్ పోలిస్ కమీషనర్ వి. సత్యనారాయణకు దన్యవాదాలు తెలిపారు.


Similar News