మహిళపై లైంగిక దాడికి యత్నించిన వ్యక్తి అరెస్ట్.

పీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళపై లైంగిక దాడికి యత్నించిన

Update: 2024-07-07 11:53 GMT

దిశ,కూకట్ పల్లి: కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళపై లైంగిక దాడికి యత్నించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శంశిగూడ, మహంకాళి నగర్ కాలనీకి చెందిన బంటు(30) ఆటో డ్రైవర్ కేపీహెచ్బీ కాలనీ టెంపుల్ బస్ స్టాప్ లో ఓ మహిళ(30) పై లైంగిక దాడికి యత్నించాడు. అక్కడే ఉన్న స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు బంటి ని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని రిమాండ్ కు తరలించారు.


Similar News