లిస్ట్ చూసి శాంటాక్లాజ్ బిత్తరపోతాడేమో..!
దిశ, వెబ్‌డెస్క్: మరో వారం రోజుల్లో క్రిస్మస్ పండుగ రాబోతుండగా, ప్రపంచవ్యాప్తంగా ఆల్రెడీ సెలెబ్రేషన్స్ మొదలయ్యాయి. అయితే క్రిస్మస్ వస్తుందంటే చాలు.. పాశ్చాత్య దేశాల్లోని పిల్లలు శాంటాక్లాజ్‌కు లెటర్స్ రాయడం చేస్తుంటారు. ప్రతి సంవత్సరం ఫాదర్ క్రిస్మస్ అనే అడ్రస్‌కు చిల్డ్రన్స్ లెటర్స్ రాయడం సంప్రదాయంగా వస్తోంది. ఈ లెటర్స్‌కు యునైటెడ్ స్టేట్స్ పోస్టల్ సర్వీస్ సమాధానలిస్తుండగా.. మంచి పిల్లలకు మాత్రమే శాంటా గిఫ్ట్స్ ఇస్తాడనేది ఓ నమ్మకం. కాగా పిల్లలు తమకు ఏమేం బహుమతులు కావాలో […]
దిశ, వెబ్‌డెస్క్: మరో వారం రోజుల్లో క్రిస్మస్ పండుగ రాబోతుండగా, ప్రపంచవ్యాప్తంగా ఆల్రెడీ సెలెబ్రేషన్స్ మొదలయ్యాయి. అయితే క్రిస్మస్ వస్తుందంటే చాలు.. పాశ్చాత్య దేశాల్లోని పిల్లలు శాంటాక్లాజ్‌కు లెటర్స్ రాయడం చేస్తుంటారు. ప్రతి సంవత్సరం ఫాదర్ క్రిస్మస్ అనే అడ్రస్‌కు చిల్డ్రన్స్ లెటర్స్ రాయడం సంప్రదాయంగా వస్తోంది. ఈ లెటర్స్‌కు యునైటెడ్ స్టేట్స్ పోస్టల్ సర్వీస్ సమాధానలిస్తుండగా.. మంచి పిల్లలకు మాత్రమే శాంటా గిఫ్ట్స్ ఇస్తాడనేది ఓ నమ్మకం. కాగా పిల్లలు తమకు ఏమేం బహుమతులు కావాలో లెటర్స్‌లో ప్రస్తావిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే యూకేలోని ఎస్సెక్స్‌కు చెందిన తొమ్మిదేళ్ల చిన్నారి రాసిన లెటర్ అందర్నీ నవ్వుకునేలా చేసింది. ఈ లెటర్‌ను ఆమె కుటుంబసభ్యులు సోషల్ మీడియాలో షేర్ చేయగా తెగ వైరలవుతోంది.
తన తొమ్మిదేళ్ల చిన్నారి చెల్లెలు రాసిన ఈ లెటర్‌ను ఓ టీనేజ్ గర్ల్ ట్విట్టర్‌లో షేర్ చేసింది. ఇంతకీ ఆ చిన్నారి లెటర్ ఎలా రాసిందంటే.. ‘‘డియర్ ఫాదర్ క్రిస్మస్, మీకు అద్భుతమైన సంవత్సరం గడిచినట్లుంది. కానీ, నాకు అలా గడవలేదు. మంచిగా ఉండటానికి నేను చాలా ప్రయత్నించాను. కానీ, ఘోరంగా విఫలమయ్యా’’ అంటూ రాసుకొచ్చింది. ఈ విషయాలన్నీ నిజాయితీగా ఒప్పుకున్నందున తనకు ప్రజెంట్ ఈ గిఫ్ట్స్ పంపండి అంటూ లెటర్‌లో రిక్వెస్ట్ చేసింది. ఆ బహుమతులకు సంబంధించి ఏకంగా ఓ లిస్ట్ కూడా లెటర్‌కు జతచేసింది. ఆ లిస్టులో ‘ఐఫోన్ 12, ఎయిర్‌ప్యాడ్స్, బతికున్న పాము, పెంగ్విన్(కాళ్లపై నడిచే సముద్ర పక్షి), డీజే సెట్, ఫ్రాన్స్ ట్రిప్‌కు వెళ్లేందుకు ఐదు టికెట్లు, మొబైల్ ల్యాప్‌టాప్, హ్యాండ్ శానిటైజర్, డెస్క్‌టాప్ న్యూ వర్షన్ కంప్యూటర్’ ఇలా 12 ఐటంలు ఇవ్వండని క్రమసంఖ్యతో సహా మెన్షన్ చేసింది. చివరకు యువర్స్ సిన్సియర్లీ అంటూ తన పేరు రాసి ముగించింది.
కాగా ఈ లెటర్‌ను ట్విట్టర్‌లో పోస్ట్ చేయడంతో నెటిజన్ల నుంచి రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. చిన్నారి నిజాయితీగా తనకు కావలసినవన్నీ అడిగిందని పలువురు మెచ్చుకుంటున్నారు. బతికున్న పాము, పెంగ్విన్ ఎందుకు? అంటూ ఇంకొందరు ప్రశ్నించారు. చిన్నారి రైటింగ్ స్టైల్ బాగుందని, వొకాబులరీ(పదకోశం) స్ట్రాంగ్‌గా ఉందంటూ పలువురు ప్రశంసిస్తున్నారు.
https://twitter.com/AllyTheJedi/status/1338732848895954945?s=20