భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. హైదరాబాద్‌లో ఎంతంటే.?

దిశ, వెబ్‌డెస్క్ : వాహనదారులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పిన విషయం తెలిసిందే. లీటరు పెట్రోల్‌పై రూ.5, లీటరు డీజిల్‌పై రూ.10 చొప్పున ఎక్సైజ్‌ సుంకం తగ్గిస్తు బుధవారం నిర్ణయం తీసుకున్నది. దీంతో తెలంగాణలోనూ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గాయి. ఈ నేపథ్యంలో వాహనదారులకు కొంత ఊరట లభించింది. తగ్గిన ధరలతో హైదరాబాద్‌లో గురువారం పెట్రోల్‌ లీటర్‌ ధర రూ.114.51 నుంచి రూ.108.18కి.. డీజిల్‌ రూ.107.40 నుంచి రూ.94.61కి తగ్గింది. కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తూ బీజేపీ పాలిత […]

Update: 2021-11-03 22:50 GMT

దిశ, వెబ్‌డెస్క్ : వాహనదారులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పిన విషయం తెలిసిందే. లీటరు పెట్రోల్‌పై రూ.5, లీటరు డీజిల్‌పై రూ.10 చొప్పున ఎక్సైజ్‌ సుంకం తగ్గిస్తు బుధవారం నిర్ణయం తీసుకున్నది. దీంతో తెలంగాణలోనూ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గాయి. ఈ నేపథ్యంలో వాహనదారులకు కొంత ఊరట లభించింది. తగ్గిన ధరలతో హైదరాబాద్‌లో గురువారం పెట్రోల్‌ లీటర్‌ ధర రూ.114.51 నుంచి రూ.108.18కి.. డీజిల్‌ రూ.107.40 నుంచి రూ.94.61కి తగ్గింది.

కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తూ బీజేపీ పాలిత రాష్ట్రాలు సైతం పెట్రోల్, డీజిల్‌ ధరలపై పన్నులను స్వల్పంగా తగ్గించాయి. కర్నాటక, అసోం, మణిపూర్‌, త్రిపుర, గోవా రాష్ట్రాల్లో లీటరుకు రూ.7 చొప్పున తగ్గించగా.. ఉత్తర ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, గుజరాత్ రాష్ట్రాల్లో పెట్రోల్‌పై రూ.5, డీజిల్ ధరలపై రూ. 10 తగ్గిస్తున్నట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఓ ప్రకటనలో పేర్కొన్నాయి. దీంతో ఆ రాష్ట్రాల్లో పెట్రోల్‌పై రూ. 10-12, డీజిల్‌‌పై రూ.15-17 మేర ధరలు తగ్గాయి.

కాబోయే భర్తే కదా.. నగ్న ఫోటోలు, న్యూడ్ వీడియో కాల్స్.. చివరకు ఏమైందంటే.?

కవితకు మరోసారి ఎమ్మెల్సీ దక్కేనా..?

Tags:    

Similar News