క్రికెటర్ల కొడుకులే 83 సినిమాలో యాక్టర్లు
దిశ, స్పోర్ట్స్: టీమ్ ఇండియా తొలి సారి వన్డే క్రికెట్ వరల్డ్ కప్ 1983లో గెలిచిన సంగతి తెలిసిందే. కపిల్ దేవ్ కెప్టెన్సీలో అండర్ గాడ్స్‌గా వెళ్లిన భారత జట్టు ఫైనల్‌లో వెస్టిండీస్‌ను ఓడించి తొలి సారి వరల్డ్ కప్‌ను సొంతం చేసుకున్నది. అప్పటి నుంచే ఇండియాలో క్రికెట్‌పై క్రేజ్ పెరిగిపోయింది. కాగా, అప్పటి వన్డే వరల్డ్ కప్ నేపథ్యంలో బాలీవుడ్‌లో ’83’ అనే సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో కపిల్ దేవ్ క్యారెక్టర్‌ను రణ్‌వీర్ సింగ్ పోషిస్తున్నాడు. […]
దిశ, స్పోర్ట్స్: టీమ్ ఇండియా తొలి సారి వన్డే క్రికెట్ వరల్డ్ కప్ 1983లో గెలిచిన సంగతి తెలిసిందే. కపిల్ దేవ్ కెప్టెన్సీలో అండర్ గాడ్స్‌గా వెళ్లిన భారత జట్టు ఫైనల్‌లో వెస్టిండీస్‌ను ఓడించి తొలి సారి వరల్డ్ కప్‌ను సొంతం చేసుకున్నది. అప్పటి నుంచే ఇండియాలో క్రికెట్‌పై క్రేజ్ పెరిగిపోయింది. కాగా, అప్పటి వన్డే వరల్డ్ కప్ నేపథ్యంలో బాలీవుడ్‌లో ’83’ అనే సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో కపిల్ దేవ్ క్యారెక్టర్‌ను రణ్‌వీర్ సింగ్ పోషిస్తున్నాడు. కాగా.. 1983లో ఇండియా, వెస్టిండీస్ జట్టులో ఉన్న కొంత మంది క్రికెటర్ల క్యారెక్టర్లను వారి కొడుకులే ఈ సినిమాలో పోషిస్తుండటం విశేషం. క్రికెటర్ సందీప్ పాటిల్ పాత్రను అతని కొడుకు చిరాగ్ పాటిల్ పోషిస్తున్నాడు.
1983 వరల్డ్ కప్‌లో పక్కటెముకలు విరిగి పోయినా మ్యాచ్‌లు ఆడి టీమ్ ఇండియాకు పాటిల్ విజయాలను అందించాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీస్‌లో ఏకంగా 51 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. ఇక వెస్టిండీస్ ఓపెనర్ గోర్డన్ గ్రీనిడ్జ్ పాత్రను అతని కుమారుడు కార్ల్ గ్రీనిడ్జ్ పోషించాడు. విండీస్ ఫాస్ట్ బౌలర్ మాల్కమ్ మార్షల్ పాత్రను కొడుకు మాలి మార్షల్ పోషించాడు. ఇక అప్పటి కెప్టెన్ క్లయివ్ లాయిడ్ కొడుకు జాసన్ లాయిడ్ కూడా ఈ సినిమాలు ఒక పాత్రలో నటించాడు. అయితే తండ్రి పాత్రలో కాకుండా ఫాస్ట్ బౌలర్ జోయల్ గార్నర్ పాత్రలో కనిపించనున్నాడు. ఇందుకు అతడు అతడి ఎత్తుతో జాసన్ ఎత్తు సరిపోవడమే. వెస్టిండీస్ మాజీ స్టార్ ప్లేయర్ శివనారాయణ్ చందర్ పాల్ కొడుకు లారో గోమ్స్ పాత్రలో నటించినట్లు తెలుస్తున్నది. మంగళవారం ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కాగా.. మంచి స్పందన వచ్చింది.