రాష్ట్రంలో 799 జీరో ఎఫ్ఐఆర్‌లు..

దిశ, క్రైమ్ బ్యూరో : తెలంగాణలో 2019 డిసెంబరు నుంచి 2021 మార్చి 6వ తేదీ వరకూ 799 జీరో ఎఫ్ఐఆర్ లు నమోదయినట్టు హోం శాఖ మంత్రి మహమ్మద్ అలీ తెలిపారు. రాష్ట్రంలో జీరో ఎఫ్ఐఆర్ విధానం అమలవుతోందా అంటూ సభ్యుడు ఎమ్మెఎస్ ప్రభాకర్ మండలిలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా హోం మంత్రి సమాధానం చెప్పారు. ఈ సందర్భంగా మహమూద్ అలీ మాట్లాడుతూ.. అత్యవసర పరిస్థితుల్లో పోలీస్ పరిధి కాకున్నా.. కేసులు నమోదు చేసి, చర్యలు […]

Update: 2021-03-20 09:19 GMT

దిశ, క్రైమ్ బ్యూరో : తెలంగాణలో 2019 డిసెంబరు నుంచి 2021 మార్చి 6వ తేదీ వరకూ 799 జీరో ఎఫ్ఐఆర్ లు నమోదయినట్టు హోం శాఖ మంత్రి మహమ్మద్ అలీ తెలిపారు. రాష్ట్రంలో జీరో ఎఫ్ఐఆర్ విధానం అమలవుతోందా అంటూ సభ్యుడు ఎమ్మెఎస్ ప్రభాకర్ మండలిలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా హోం మంత్రి సమాధానం చెప్పారు.

ఈ సందర్భంగా మహమూద్ అలీ మాట్లాడుతూ.. అత్యవసర పరిస్థితుల్లో పోలీస్ పరిధి కాకున్నా.. కేసులు నమోదు చేసి, చర్యలు తీసుకునే జీరో విధానాన్ని పోలీస్ శాఖ అమలు చేస్తున్నట్టు బదులిచ్చారు. ఫిర్యాదుల నమోదులో జాప్యాన్ని నివారించడంతో పాటు సమాచారం అందించిన వారికి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతోందని అన్నారు. ముఖ్యంగా జీరో ఎఫ్ఐఆర్లో‌ ఫిర్యాదు అందగానే, ప్రాథమిక దర్యాప్తు చేపట్టి సత్వర చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. బాధితులకు వైద్య సహాయం, అవాంఛనీయ పరిస్థితులను తప్పించేందుకు చర్యలు ఉంటాయన్నారు.

 

Tags:    

Similar News