వలస కూలీలకు రూ. 74 లక్షల సాయం
దిశ, కరీంనగర్: కరోనా నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డైన్ కొనసాగుతున్నంది. ఈ క్రమంలో ఉపాధిని కోల్పొయిన వలస కూలీలను ఆదుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించినట్టు కరీంనగర్ జిల్లా కలెక్టర్ శశాంక తెలిపారు. ఈ మేరకు కొద్ది సేపటి కిందటే ప్రభుత్వం జీవో విడుదల చేసిందని ఆయన వివరించారు. దీని ప్రకారం జిల్లాలో 14,495 మంది వలస కూలీలను గుర్తించినట్టు తెలిపారు. ఒక్కొక్కరికి 12 కిలోల చొప్పున బియ్యంతో పాటు, రూ. 500 ఆర్థిక సాయం అందిస్తామని […]
దిశ, కరీంనగర్: కరోనా నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డైన్ కొనసాగుతున్నంది. ఈ క్రమంలో ఉపాధిని కోల్పొయిన వలస కూలీలను ఆదుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించినట్టు కరీంనగర్ జిల్లా కలెక్టర్ శశాంక తెలిపారు. ఈ మేరకు కొద్ది సేపటి కిందటే ప్రభుత్వం జీవో విడుదల చేసిందని ఆయన వివరించారు. దీని ప్రకారం జిల్లాలో 14,495 మంది వలస కూలీలను గుర్తించినట్టు తెలిపారు. ఒక్కొక్కరికి 12 కిలోల చొప్పున బియ్యంతో పాటు, రూ. 500 ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు. దీనంతటికి మొత్తం రూ.74 లక్షల అవుతుందన్నారు.మంగళవారం సాయంత్రానికల్లా వలస కూలీలందరికీ సాయం చేస్తామని కలెక్టర్ వెల్లడించారు. ఈ సహాయాన్ని కూలీల వద్దకే వెల్లి అందజేయనున్నట్టు శశాంక తెలిపారు.
Tags : corona, labour, 74 lacs fund donate, ts govt order, collector shashanka