ఈ విస్కీ బాటిల్ కోసం ఆస్తుల్నే అమ్ముకుంటున్నారు

దిశ,వెబ్‌డెస్క్: విస్కీ బాటిల్ ఖరీదు ఎంతుంటుంది..? బ్రాండెడ్ను బట్టి లక్షా, లేదంటే పది లక్షల వరకు ఉంటుంది. కానీ ఈ విస్కీ బాటిల్ ఖరీదు అక్షరాల రూ.39లక్షలు. వామ్మో అంతఖరీదా అని అనుకోవచ్చు. కానీ ఔత్సాహికులు మాత్రం ఎంతైనా ఖరీదు పర్లేదు. తాగితే ఈ విస్కీయే తాగాలంటూ తమ ఆస్తుల్ని సైతం అమ్మేందుకు వెనకాడడం లేదని విస్కీ స్పెషలిస్ట్ క్రిస్టోఫర్ పాంగ్ తెలిపారు. స్కాట్లాండ్‌కు చెందిన 72ఏళ్ల నాటి గ్లెన్‌గ్రాంట్ సింగిల్మాల్ట్ అనే విస్కీ బాటిల్‌పై హాంకాంగ్ […]

Update: 2021-01-29 21:15 GMT

దిశ,వెబ్‌డెస్క్: విస్కీ బాటిల్ ఖరీదు ఎంతుంటుంది..? బ్రాండెడ్ను బట్టి లక్షా, లేదంటే పది లక్షల వరకు ఉంటుంది. కానీ ఈ విస్కీ బాటిల్ ఖరీదు అక్షరాల రూ.39లక్షలు. వామ్మో అంతఖరీదా అని అనుకోవచ్చు. కానీ ఔత్సాహికులు మాత్రం ఎంతైనా ఖరీదు పర్లేదు. తాగితే ఈ విస్కీయే తాగాలంటూ తమ ఆస్తుల్ని సైతం అమ్మేందుకు వెనకాడడం లేదని విస్కీ స్పెషలిస్ట్ క్రిస్టోఫర్ పాంగ్ తెలిపారు.

స్కాట్లాండ్‌కు చెందిన 72ఏళ్ల నాటి గ్లెన్‌గ్రాంట్ సింగిల్మాల్ట్ అనే విస్కీ బాటిల్‌పై హాంకాంగ్ లో వేలంపాట జరిగింది. ఈ వేలం పాటలో 1948 గ్లెన్ గ్రాంట్ డిస్టిలరీ అనే కంపెనీ తయారు చేసిన విస్కీ బాటిల్‌ను రూ.39లక్షలు పెట్టి దక్కించుకున్నట్లు ఆ విస్కీ బాటిల్‌ను వేలం వేసిన బోన్హామ్స్ సంస్థ ప్రతినిధులు తెలిపారు.

ఇదే వేలం పాటలో జపాన్ కు చెందిన 35ఏళ్ల నాటి హిబ్కీ విస్కీ బాటిల్ ను వేలం వేయగా ఓ మందు బాబు రూ.35లక్షలు పెట్టి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా విస్కీ స్పెషలిస్ట్ క్రిస్టోఫర్ ఫాంగ్ మాట్లాడుతూ గత పదేళ్ల నుంచి మద్యం కొనుగోళ్ల విషయంలో ఔత్సాహికులు ఖర్చుకు వెనక్కి తగ్గడం లేదన్నారు. కరోనా క్రైసిస్ అయినా, ఆర్థిక మాంద్యమైనా మద్యం బాటిల్ ధర విషయంలో కాంప్రమైజ్ కావడం లేదు. అందుకు ఉదాహరణే ఈ వేలంపాట’ అని చెప్పారు.

Tags:    

Similar News