65 శాతం తగ్గిన ఎడ్యుకేషన్ బడ్జెట్.. ప్రపంచ దేశాలకు వరల్డ్ బ్యాంక్ హెచ్చరిక

దిశ,వెబ్‌డెస్క్: కరోనా కారణంగా తక్కువ ప్రపంచంలోని పలు దేశాలకు చెందిన ప్రభుత్వాలు ఎడ్యుకేషన్ బడ్జెట్ ను 65శాతానికి తగ్గించినట్లు వరల్డ్ బ్యాంక్ తెలిపింది. కేవలం ఎడ్యుకేషన్ బడ్జెట్ ను 33శాతమే కేటాయించనున్నట్లు  వరల్డ్ బ్యాంక్ చెప్పింది. యునెస్కో గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ ద్వారా రిపోర్ట్ యునెస్కోకు చెందిన గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ (జీఈఎం) ద్వారా దిగువ-మధ్య-ఆదాయ దేశాలలో ప్రభుత్వ వ్యయాలు, ప్రస్తుత స్థాయిలు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ (ఎస్డీజీ) సాధించడానికి అవసరమైన వాటి కంటే తక్కువగా ఉంటాయని వరల్డ్ […]

Update: 2021-02-28 05:42 GMT

దిశ,వెబ్‌డెస్క్: కరోనా కారణంగా తక్కువ ప్రపంచంలోని పలు దేశాలకు చెందిన ప్రభుత్వాలు ఎడ్యుకేషన్ బడ్జెట్ ను 65శాతానికి తగ్గించినట్లు వరల్డ్ బ్యాంక్ తెలిపింది. కేవలం ఎడ్యుకేషన్ బడ్జెట్ ను 33శాతమే కేటాయించనున్నట్లు వరల్డ్ బ్యాంక్ చెప్పింది.

యునెస్కో గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ ద్వారా రిపోర్ట్

యునెస్కోకు చెందిన గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ (జీఈఎం) ద్వారా దిగువ-మధ్య-ఆదాయ దేశాలలో ప్రభుత్వ వ్యయాలు, ప్రస్తుత స్థాయిలు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ (ఎస్డీజీ) సాధించడానికి అవసరమైన వాటి కంటే తక్కువగా ఉంటాయని వరల్డ్ బ్యాంక్ గుర్తించింది. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాల్లో కరోనా ప్రభావం ఎడ్యుకేషన్ రంగంపై ఎలాంటి ప్రభావం చూపించిందనే అంశంపై వరల్డ్ బ్యాంక్.., జీఈఎంతో కలిసి 29దేశాల్లో 54 శాతం మంది ప్రజల అభిప్రాయాల్ని అడిగి తెలుసుకుంది.

కరోనా నుంచి విద్యారంగాన్ని కాపాడడం ఎలా?

విద్యారంగాన్ని కాపాడడంతో పాటూ కరోనా వైరస్ ను అరికట్టేలా చర్యలు తీసుకునేలా వరల్డ్ బ్యాంక్ పలు సూచనలు చేసింది. కరోనా వ్యాప్తితో స్కూళ్లు మూసివేయడంతో విద్యార్ధులకు నష్టం జరిగిందని, ఆ నష్టం నుంచి భయట పడాలంటే అదనంగా నిధులు కేటాయించాల్సిన అవసరం ఉందని వరల్డ్ బ్యాంక్ అభిప్రాయం వ్యక్తం చేసింది.

ఎడ్యుకేషన్ బడ్జెట్‌ను తగ్గించనున్న దేశాలివే

వరల్డ్ బ్యాంక్ సర్వే నిర్వహించిన దేశాల్లో అన్నీ దేశాలకంటే ఆర్ధికంగా అతి తక్కువ స్థాయిలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్, ఇథియోపియా, ఉగాండాతో పాటూ 14 తక్కువ- మధ్య-ఆదాయ దేశాలైన బంగ్లాదేశ్, ఈజిప్ట్, ఇండియా, కెన్యా, కిర్గిజ్ రిపబ్లిక్, మొరాకో, మయన్మార్, నేపాల్, నైజీరియా, పాకిస్తాన్, ఫిలిప్పీన్స్, టాంజానియా, ఉక్రెయిన్, ఉజ్బెకిస్తాన్ !

10 ఎగువ-మధ్య-ఆదాయ దేశాలు అర్జెంటీనా, బ్రెజిల్, కొలంబియా, జోర్డాన్, ఇండోనేషియా, కజాఖ్స్తాన్, మెక్సికో, పెరూ, రష్యా, టర్కీ లు ఉన్నాయి. వీటితో పాటూ సంపన్న దేశాలైన చిలీ, పనామాలు ఉన్నట్లు గుర్తించింది. ఆదాయాన్ని గడించే శాఖలకంటే 10 శాతం తక్కువగానే ఎడ్యుకేషన్ బడ్జెట్ ను కేటాయించే దేశాలున్నాయి. వాటిలో అర్జెంటీనా, బ్రెజిల్, ఈజిప్ట్, ఇండియా, మయన్మార్, నైజీరియా, పాకిస్తాన్ మరియు రష్యా’ అని నివేదిక పేర్కొంది.

ఈ సందర్భంగా ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు మాట్లాడుతూ కరోనా కారణంగా ప్రపంచ దేశాలు ఎడ్యుకేషన్ బడ్జెట్ ను అదనంగా కేటాయిస్తాయో లేదో చెప్పడం అనేది కష్టమని తెలిపారు. స్కూళ్లు సురక్షితంగా తెరిచేందుకు నిధులు ఉన్నప్పటికి ఆయా దేశాల ప్రభుత్వాలు ఎడ్యుకేషన్ పై నిధుల్ని కేటాయించడం తగ్గించినట్లు వరల్డ్ బ్యాంక్ వెల్లడించింది. దీంతో స్థూల ఆర్థిక పరిస్థితులు మరింత దిగజారిపోతాయని, అదే జరిగితే భవిష్యత్ ప్రమాదంలో పడే అవకాశం ఉందని వరల్డ్ బ్యాంక్ హెచ్చరించింది.

Tags:    

Similar News