రష్యాలో తాజాగా 6,109 కేసులు

దిశ, వెబ్ డెస్క్: రష్యాలో కరోనా విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 6,109 కరోనా కేసులు నమోదైనట్టు అక్కడి రెస్పాన్స్ సెంటర్ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 7,71,546కు చేరింది. తాజాగా 84 ప్రాంతాల నుంచి ఈ కేసులు బయటపడినట్టు రెస్పాన్స్ సెంటర్ పేర్కొంది. తాజా కేసుల్లో 1,514 మందిలో ఎటువంటి లక్షణాలు కనిపించలేదని తెలిపింది. రాజధాని మాస్కోలో అత్యధికంగా 591 కేసులు వెలుగులోకి వచ్చాయి. ఆదివారం ఒక్క రోజే దేశ వ్యాప్తంగా 95 మంది […]

Update: 2020-07-19 11:33 GMT

దిశ, వెబ్ డెస్క్: రష్యాలో కరోనా విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 6,109 కరోనా కేసులు నమోదైనట్టు అక్కడి రెస్పాన్స్ సెంటర్ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 7,71,546కు చేరింది. తాజాగా 84 ప్రాంతాల నుంచి ఈ కేసులు బయటపడినట్టు రెస్పాన్స్ సెంటర్ పేర్కొంది. తాజా కేసుల్లో 1,514 మందిలో ఎటువంటి లక్షణాలు కనిపించలేదని తెలిపింది.

రాజధాని మాస్కోలో అత్యధికంగా 591 కేసులు వెలుగులోకి వచ్చాయి. ఆదివారం ఒక్క రోజే దేశ వ్యాప్తంగా 95 మంది మృతిచెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 12,342కు చేరుకుంది. ఇప్పటివరకు అక్కడ 5,50,344 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాల జాబితాలో రష్యా నాలుగో స్థానంలో ఉంది. అమెరికా, బ్రెజిల్, ఇండియా అత్యధిక కరోనా కేసులు నమోదైన జాబితాలో మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి.

Tags:    

Similar News