డబుల్ బెడ్ రూం ఇళ్లకు నిధులు విడుదల

దిశ, తెలంగాణ బ్యూరో: గ్రేటర్ ఎన్నికల తాయిలాల్లో ప్రభుత్వం మరో ఆశ చూపుతోంది. ఇప్పటికే వరద సాయం పేరుతో నగదు పంపిణీ చేస్తున్న సర్కారు.. నగరంలో డబుల్ బెడ్ రూం ఇండ్లకు నిధులు విడుదల చేస్తూ బీఆర్‌వో జారీ చేసింది. అయితే గ్రేటర్ పరిధిలోని ఇళ్లకు మాత్రమే ఈ నిధులు ఇస్తున్నట్లు జీవోలో పేర్కొంది. గత నాలుగేళ్ల నుంచి డబుల్ బెడ్ రూం ఇళ్లను పంపిణీ చేస్తామంటూ ప్రకటనలు చేస్తున్న నేతలు ఇప్పటివరకు నిర్మాణాలే పూర్తి చేయలేదు. […]

Update: 2020-11-05 08:06 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: గ్రేటర్ ఎన్నికల తాయిలాల్లో ప్రభుత్వం మరో ఆశ చూపుతోంది. ఇప్పటికే వరద సాయం పేరుతో నగదు పంపిణీ చేస్తున్న సర్కారు.. నగరంలో డబుల్ బెడ్ రూం ఇండ్లకు నిధులు విడుదల చేస్తూ బీఆర్‌వో జారీ చేసింది. అయితే గ్రేటర్ పరిధిలోని ఇళ్లకు మాత్రమే ఈ నిధులు ఇస్తున్నట్లు జీవోలో పేర్కొంది.

గత నాలుగేళ్ల నుంచి డబుల్ బెడ్ రూం ఇళ్లను పంపిణీ చేస్తామంటూ ప్రకటనలు చేస్తున్న నేతలు ఇప్పటివరకు నిర్మాణాలే పూర్తి చేయలేదు. కానీ బండ్లగూడ, కొల్లూరులో ఇళ్లను పూర్తి చేసి ఈ ఏడాదిలో అప్పగిస్తామని ప్రకటన చేశారు. కానీ ఆ ప్రాంతాల్లో ఇప్పుడు 80శాతం వరకే నిర్మాణాలు పూర్తయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.3,850 కోట్లు బడ్జెట్‌లో కేటాయించామని, దీనిలో రూ.600 కోట్లు విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. గతంలో రూ. 150కోట్లు విడుదల చేసినట్లు జీవోలో వివరించారు. తెలంగాణ గృహ నిర్మాణ సంస్థ ఖాతాలో ఈ నిధులు జమ చేస్తున్నట్లు జీవోలో పేర్కొంటూ ప్రిన్సిపల్ సెక్రెటరీ సునీల్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు.

Tags:    

Similar News