వరల్డ్ రికార్డ్ సాధించిన ‘లిప్‌బామ్’ గర్ల్!
దిశ, ఫీచర్స్ : ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది వ్యక్తులు తమ స్పెషల్ టాలెంట్‌తో ప్రసిద్ధి పొందగా, కొందరేమో తమ హాబీతో వరల్డ్ రికార్డ్స్ సృష్టించారు. హాంకాంగ్‌కు చెందిన 6 ఏళ్ల బాలిక స్కార్లెట్ ఆష్లే చెంగ్ కూడా ఈ లిస్ట్‌లో చేరిపోయింది. అవును, ఆమెకు లిప్ బామ్స్ కొనడమంటే చాలా ఇష్టం, తన ఇల్లంతా వాటితోనే నింపేసిందంటే ఆ అమ్మాయికి అవి అంటే ఎంత ఇష్టమో అర్థం చేసుకోండి. స్కార్లెట్ అభిరుచే ఆమెకు గిన్నిస్ వరల్డ్ […]
దిశ, ఫీచర్స్ : ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది వ్యక్తులు తమ స్పెషల్ టాలెంట్‌తో ప్రసిద్ధి పొందగా, కొందరేమో తమ హాబీతో వరల్డ్ రికార్డ్స్ సృష్టించారు. హాంకాంగ్‌కు చెందిన 6 ఏళ్ల బాలిక స్కార్లెట్ ఆష్లే చెంగ్ కూడా ఈ లిస్ట్‌లో చేరిపోయింది. అవును, ఆమెకు లిప్ బామ్స్ కొనడమంటే చాలా ఇష్టం, తన ఇల్లంతా వాటితోనే నింపేసిందంటే ఆ అమ్మాయికి అవి అంటే ఎంత ఇష్టమో అర్థం చేసుకోండి. స్కార్లెట్ అభిరుచే ఆమెకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ తెచ్చిపెట్టింది. ఆమె తన సిస్టర్ కాలిన్తో కలిసి ఈ లిప్ బామ్స్ సేకరిస్తుంది. ఇప్పుడు ఆమె దగ్గర దాదాపు 3,888 లిప్ బామ్స్ ఉన్నాయని గిన్నిస్ నిర్వహకులు తేల్చారు. అనేక రంగులు, విభిన్న ఆకారాలతో కూడిన లిప్బామ్స్లో.. బర్ట్స్ బీస్, ఇయోస్, హంబుల్, నివియా, చుప్పా చుప్స్ వంటి ప్రసిద్ధ బ్రాండ్స్‌తో పాటు పలు దేశాలకు చెందిన కలెక్షన్‌ని సేకరించింది.
‘ఇదంతా మా చిన్నతనం నుంచే ప్రారంభమైంది. మా పెదాలు పొడిబారడంతో తేమగా ఉంచడానికి మా తల్లిదండ్రులు, అమ్మమ్మ ప్రతిరోజూ లిప్ బామ్స్ వేసేవారు. మొదట్లో ఏ ఫ్లేవర్స్ లేని సాదాసీదా లిప్‌బామ్స్ వాడగా, ప్రస్తుతం వివిధ ఫ్లేవర్స్ ప్రయత్నిస్తున్నాను. అవి కనిపించే తీరు, వాటి రుచి ఆకట్టుకోవడంతో.. వీటి కలెక్షన్ ఓ హాబీ అయిపోయింది. లిప్‌బామ్ అంటే నాకు ఉన్న అభిమానంతో నా స్నేహితులు కూడా సేకరణలోని కొన్నింటిని కానుకగా అందించారు. ఇక మా తల్లిదండ్రులు కూడా ఇందుకు సహకరించారు.
– స్కార్లెట్ ఆష్లే చెంగ్