కరోనా..సీఎంఆర్ఎఫ్‌కు బాలుడి కిడ్డీ బ్యాంక్

దిశ, కరీంనగర్:కరోనా బాధితులను ఆదుకునేందుకు ఐదో తరగతి చదువుతున్నబాలుడు ముందుకు వచ్చాడు. తల్లిదండ్రులు ఇచ్చిన ప్రతి పైసాను తన కిడ్డీ బ్యాంకులో పొగుచేసుకున్న అతడు ఆ మొత్తాన్ని తనకోసం కాకుండా కరోనా బారిన పడ్డ వారి కోసం వినియోగించండి అంటూ మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు సోమవారం అందజేశాడు. వివరాల్లోకి వెళితే.. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం ఎల్లాపూర్ గ్రామంలో ఐదో తరగతి చదువుతున్న మోదుంపెల్లి సిద్దార్థ కరోనా బాధితులకు సాయం చేయాలనుకున్నాడు. తన కిడ్డీ బ్యాంకులో దాచుకున్న […]

Update: 2020-03-30 07:10 GMT

దిశ, కరీంనగర్:కరోనా బాధితులను ఆదుకునేందుకు ఐదో తరగతి చదువుతున్నబాలుడు ముందుకు వచ్చాడు. తల్లిదండ్రులు ఇచ్చిన ప్రతి పైసాను తన కిడ్డీ బ్యాంకులో పొగుచేసుకున్న అతడు ఆ మొత్తాన్ని తనకోసం కాకుండా కరోనా బారిన పడ్డ వారి కోసం వినియోగించండి అంటూ మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు సోమవారం అందజేశాడు. వివరాల్లోకి వెళితే..

జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం ఎల్లాపూర్ గ్రామంలో ఐదో తరగతి చదువుతున్న మోదుంపెల్లి సిద్దార్థ కరోనా బాధితులకు సాయం చేయాలనుకున్నాడు. తన కిడ్డీ బ్యాంకులో దాచుకున్న రూ. 2,500ను కరోనా వైరస్ నివారణ కోసం ఉపయోగించాలని కోరుతూ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం ఇచ్చాడు. కరోనా బాధితులను ఆదుకునేందుకు బాలుడు చేసిన సాయం చూసి మంత్రి కొప్పుల ఈశ్వర్ చలించిపోయారు. అతన్ని అక్కున చేర్చుకుని అభినందించారు.

Tags : 5th class child donate rs.2500, corona, lockdown, karimnagar, minister koppula eshwar

Tags:    

Similar News