2022 ఏప్రిల్-మే నాటికి 5జీ స్పెక్ట్రమ్ వేలం!
దిశ, వెబ్‌డెస్క్: వచ్చే ఏడాది ఏప్రిల్, మే నాటికి 5జీ స్పెక్ట్రమ్ వేలం వేయాలని ప్రభుత్వం భావిస్తోందని సమాచార, ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ గురువారం ఓ కార్యక్రమంలో తెలిపారు. ప్రస్తుతం టెలికాం నియంత్రణ సంస్థ(ట్రాయ్) ఈ అంశంపై పనిచేస్తోందని, వారి సిఫార్సుల తర్వాత వేలాన్ని ప్రారంభించే అవకాశం ఉందని ఆయన అన్నారు. 2022 ఫిబ్రవరి చివరి నాటికి లేదా మార్చి ప్రారంభంలో ట్రాయ్ తన సిఫార్సులను డీఓటీ పంపుతుందని ఆశిస్తున్నామని, సమగ్రమైన సంప్రదింపుల తరువాతే ట్రాయ్ […]
దిశ, వెబ్‌డెస్క్: వచ్చే ఏడాది ఏప్రిల్, మే నాటికి 5జీ స్పెక్ట్రమ్ వేలం వేయాలని ప్రభుత్వం భావిస్తోందని సమాచార, ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ గురువారం ఓ కార్యక్రమంలో తెలిపారు. ప్రస్తుతం టెలికాం నియంత్రణ సంస్థ(ట్రాయ్) ఈ అంశంపై పనిచేస్తోందని, వారి సిఫార్సుల తర్వాత వేలాన్ని ప్రారంభించే అవకాశం ఉందని ఆయన అన్నారు. 2022 ఫిబ్రవరి చివరి నాటికి లేదా మార్చి ప్రారంభంలో ట్రాయ్ తన సిఫార్సులను డీఓటీ పంపుతుందని ఆశిస్తున్నామని, సమగ్రమైన సంప్రదింపుల తరువాతే ట్రాయ్ నివేదిక అందించనుందన్నారు. అంతేకాకుండా టెలికాం రంగాన్ని లాభదాయకంగా పునరుద్ధరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, సంక్లిష్టమైన నియంత్రణ వ్యవస్థపై పని చేస్తోందని వైష్ణవ్ చెప్పారు. టెలికాం రంగం కోసం ప్రకటించిన సంస్కరణలు, తర్వాత తరం కోసం తీసుకునే చర్యల సామర్థ్యం రానున్న రెండు మూడేళ్లలో సాకారం కానున్నాయని మంత్రి వెల్లడించారు.