వచ్చే ఏడాదిలో 5జీ స్పెక్ట్రమ్ వేలం!

దిశ, వెబ్‌డెస్క్: దేశీయంగా కొత్త టెక్నాలజీ 5జీ స్పెక్ట్రమ్ వేలం 2022, ఫిబ్రవరిలో ఉండే అవకాశం ఉందని కేంద్రం వెల్లడించింది. బుధవారం ప్రభుత్వం టెలికాం రంగంలో కీలకమైన సంస్కరణలు ప్రకటించిన తర్వాత పరిశ్రమలో పోటీ పెరుగుతుందని కేంద్ర టెలికాం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. దీనివల్ల భారత టెలికాం రంగంలో కొత్త కంపెనీలు వస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.  అనుకున్న సమయానికి అన్నీ పూర్తయితే వచ్చే ఏడాది జనవరి సమయానికే వేలం ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్నామని […]

Update: 2021-09-16 08:11 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశీయంగా కొత్త టెక్నాలజీ 5జీ స్పెక్ట్రమ్ వేలం 2022, ఫిబ్రవరిలో ఉండే అవకాశం ఉందని కేంద్రం వెల్లడించింది. బుధవారం ప్రభుత్వం టెలికాం రంగంలో కీలకమైన సంస్కరణలు ప్రకటించిన తర్వాత పరిశ్రమలో పోటీ పెరుగుతుందని కేంద్ర టెలికాం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. దీనివల్ల భారత టెలికాం రంగంలో కొత్త కంపెనీలు వస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. అనుకున్న సమయానికి అన్నీ పూర్తయితే వచ్చే ఏడాది జనవరి సమయానికే వేలం ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్నామని అశ్విన్ అన్నారు.

తాజాగా కేంద్రం టెలికాం రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడు(ఎఫ్‌డీఐ)లకు అనుమతిచ్చింది. అంతేకాకుండా తీవ్ర ఆర్థిక కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న కంపెనీలకు ఊరటనిస్తూ ఏజీఆర్ బకాయిలపై నాలుగేళ్ల పాటు మారటోరియం అవకాశాన్నిచ్చింది. అలాగే, టెలికామేతర ఆదాయాలను ఏజీఆర్ నుంచి మినహాయింపు సైతం ఇచ్చారు. ఈ నేపథ్యంలో టెలికాం రంగంలో సంస్కరణల వల్ల కంపెనీలు పుంజుకోవడమే కాకుండా విస్తృతమైన పోటీ ఉండనుంది. ఈ నిర్ణయాలతో కంపెనీలకు నగదు కొరత ఉండదని టెలికాం శాఖ మంత్రి వివరించారు.

Tags:    

Similar News