ఒకే సారి 55 గొర్రెలను బలితీసుకున్న రైలు.. కంటతడి పెట్టిన కాపరి
దిశ, బాల్కొండ : ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు రైలు ఢీకొనడంతో యాభై గొర్రెలు మృతి చెందాయి. ఈ ఘటన వేల్పూర్ మండల పరిధిలోని కుకూనుర్ శివారులో అంక్సాపూర్ గ్రామంలో గురువారం ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. గ్రామానికి చెందిన గొర్రెల కాపరి గొల్ల చిన్న బోజేందర్‌కు చెందిన గొర్రెలు మోర్తాడ్ నుండి నిజామాబాద్ వైపు వస్తున్న రైల్వే ట్రాక్ పై వెళ్తుండగా.. అనుకోకుండా రైలు రావడంతో యాభై ఐదు(55) గొర్రెలు మృతి చెందాయి. రైలు […]
దిశ, బాల్కొండ : ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు రైలు ఢీకొనడంతో యాభై గొర్రెలు మృతి చెందాయి. ఈ ఘటన వేల్పూర్ మండల పరిధిలోని కుకూనుర్ శివారులో అంక్సాపూర్ గ్రామంలో గురువారం ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. గ్రామానికి చెందిన గొర్రెల కాపరి గొల్ల చిన్న బోజేందర్‌కు చెందిన గొర్రెలు మోర్తాడ్ నుండి నిజామాబాద్ వైపు వస్తున్న రైల్వే ట్రాక్ పై వెళ్తుండగా.. అనుకోకుండా రైలు రావడంతో యాభై ఐదు(55) గొర్రెలు మృతి చెందాయి.
రైలు రాకను గుర్తించకపోవడం వల్లే ఈ ఘటన జరిగి ఉంటుందని అంతా భావించారు. ఈ ప్రమాదం కుకూనుర్ శివారులోని రైల్వే బ్రిడ్జి కమాన్ వద్ద జరిగింది. ఒకేసారి పెద్ద మొత్తంలో గొర్రెలు చనిపోవడంతో సుమారు రూ.5 లక్షల ఆర్థిక నష్టం వాటిల్లినట్టు బాధితుడు వాపోయాడు. తమ జీవనాధారం ఒక్కసారిగా కోల్పోవడంతో బాధిత కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపించింది. ఎవరైనా ముందుకు వచ్చి ఆర్థికసాయం అందజేయాలని కోరుతున్నారు.