చైనాలో కొత్తగా 46 కేసులు నమోదు

కరోనా వైరస్ పుట్టిన చైనాలో ఆదివారం 46 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇటీవల అక్కడ కొత్తగా కేసులు నమోదు కాలేదు. అయితే విదేశాల నుంచి వచ్చిన వారితోనే కొత్తగా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నట్లు చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ వెల్లడించింది. శనివారం 41 కేసులు నమోదు కాగా, ఆదివారం నాటికి ఈ సంఖ్య 46కు చేరింది. మరో ఆరుగురు కరోనా బాధితులు మృతి చెందినట్లు కూడా అక్కడి అధికారులు తెలిపారు. దీంతో మరోసారి చైనాలో […]

Update: 2020-03-21 21:46 GMT

కరోనా వైరస్ పుట్టిన చైనాలో ఆదివారం 46 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇటీవల అక్కడ కొత్తగా కేసులు నమోదు కాలేదు. అయితే విదేశాల నుంచి వచ్చిన వారితోనే కొత్తగా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నట్లు చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ వెల్లడించింది. శనివారం 41 కేసులు నమోదు కాగా, ఆదివారం నాటికి ఈ సంఖ్య 46కు చేరింది. మరో ఆరుగురు కరోనా బాధితులు మృతి చెందినట్లు కూడా అక్కడి అధికారులు తెలిపారు. దీంతో మరోసారి చైనాలో కరోనా కేసులు నమోదు అవుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే చైనాలో 81,054 మందికి కరోనా వైరస్ సోకగా, 3,261 మంది మరణించారు. చైనాలో కొత్త కేసులు వెలుగుచూడటంతో పాటు మరణాల సంఖ్య పెరుగుతుండటంతో ఆందోళన కలిగిస్తోంది.

Tags: corona, china, 46 positive cases registered

Tags:    

Similar News