58 నిమిషాల్లో 46 వంటలు.. ప్రపంచ రికార్డ్
దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా ఇంట్లో వంట చేయడానికి ఎంత సమయం పడుతుంది? కనీసం గంట నుంచి మూడు గంటలు. ఇక 46 రకాల వంటలు చేయాలంటే ఒకట్రెండు రోజులైనా పడుతుంది. కానీ తమిళనాడుకు చెందిన ఎస్‌ఎన్ లక్ష్మి సాయి శ్రీ అనే బాలిక గంట సమయం లోపే.. అంటే కేవలం 58 నిమిషాల్లోనే 46 రకాల వంటలు చేసి ప్రపంచ రికార్డ్ సృష్టించింది. మంగళవారం నాడు చెన్నైలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని యునికో బుక్ ఆఫ్ వరల్డ్ […]
దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా ఇంట్లో వంట చేయడానికి ఎంత సమయం పడుతుంది? కనీసం గంట నుంచి మూడు గంటలు. ఇక 46 రకాల వంటలు చేయాలంటే ఒకట్రెండు రోజులైనా పడుతుంది. కానీ తమిళనాడుకు చెందిన ఎస్‌ఎన్ లక్ష్మి సాయి శ్రీ అనే బాలిక గంట సమయం లోపే.. అంటే కేవలం 58 నిమిషాల్లోనే 46 రకాల వంటలు చేసి ప్రపంచ రికార్డ్ సృష్టించింది. మంగళవారం నాడు చెన్నైలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని యునికో బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకుంది. తన తల్లి దగ్గర వంట చేయడం నేర్చుకుని, ఇలా ప్రపంచ రికార్డ్ సృష్టించడం చాలా సంతోషంగా ఉందని లక్ష్మి సాయి శ్రీ తెలిపింది.
లాక్‌డౌన్ టైమ్‌లో తన కూతురికి వంట చేయడం నేర్పించినట్లు లక్ష్మి తల్లి కళైమగల్ చెప్పారు. అయితే వరల్డ్ రికార్డ్ కోసం ప్రయత్నించాలనేది లక్ష్మి తండ్రి ఐడియా. కేరళకు చెందిన శాన్వి అనే బాలిక గంటసేపట్లో 30 వంటకాలు చేసి సృష్టించిన రికార్డ్ గురించి లక్ష్మి తండ్రి తెలుసుకుని, లక్ష్మిని కూడా ఆ దిశగా తయారు చేయమని చెప్పినట్లు కళైమగల్ వివరించింది. తమిళనాడు సంప్రదాయ వంటకాలన్నింటినీ లక్ష్మి చేయగలుగుతుందని, చిటికెలో చేసినంత మాత్రాన రుచిలో ఏమాత్రం తేడా ఉండదని, అద్భుతంగా ఉంటాయని కళైమగల్ చెప్పారు.