రాష్ట్రానికి 4.25 కోట్ల పనిదినాలు..!
దిశ వెబ్‌డెస్క్: నరేగాకు సంబంధించి రాష్ట్రానికి 4.25 కోట్ల పనిదినాలు అదనంగా వచ్చాయని సీఎం జగన్ స్పష్టం చేశారు. స్పందన కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్, చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రానికి పనిదినాలతో పాటు అదనంగా రూ.4వేల కోట్లకు సంబంధించిన మెటీరియల్ కాంపోనెంట్‌కు అవకాశం […]
దిశ వెబ్‌డెస్క్: నరేగాకు సంబంధించి రాష్ట్రానికి 4.25 కోట్ల పనిదినాలు అదనంగా వచ్చాయని సీఎం జగన్ స్పష్టం చేశారు. స్పందన కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్, చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
రాష్ట్రానికి పనిదినాలతో పాటు అదనంగా రూ.4వేల కోట్లకు సంబంధించిన మెటీరియల్ కాంపోనెంట్‌కు అవకాశం ఉందని సీఎం జగన్ తెలిపారు. పది జిల్లాలో రూ. 10 కోట్లు ప్రతివారంలో మెటీరియల్ కాంపోనెంట్‌ను వినియోగించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుని పనులు చేపట్టాలన్నారు. గ్రామ సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలు, వైఎస్‌ఆర్ హెల్త్‌క్లినిక్స్‌ను పూర్తి చేయడం, అంగన్ వాడీ కేంద్రాల నిర్మాణాలు, స్కూల్ కాంపొండ్ లను పూర్తి చేయడంపై దృష్టి సారించాలని ఆదేశించారు. ఈ నెలాఖరు నాటికి ఈ నిర్మాణాలు పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేయాలని సూచించారు.