12 గంటల్లో నో కేస్..ఏపీ @ 348

ఆంధ్రప్రదేశ్‌లో గత 12 గంటల్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని ప్రభుత్వం ప్రకటించింది. ప్రతి రోజూ పదుల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదై రాష్ట్ర ప్రజలకు ఆందోళన కలిగించిన కరోనా నిన్న సాయంత్రం కాస్త శాంతించింది. కర్నూలు, గుంటూరు, నెల్లూరు జిల్లాలను బెంబేలెత్తించిన కరోనా నేటికి తెరిపినిచ్చింది. గత రాత్రి 9 గంటల నుంచి నేటి ఉదయం 9 గంటల వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. మొత్తం 217 శాంపిల్స్ పరీక్షించగా […]

Update: 2020-04-09 00:35 GMT

ఆంధ్రప్రదేశ్‌లో గత 12 గంటల్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని ప్రభుత్వం ప్రకటించింది. ప్రతి రోజూ పదుల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదై రాష్ట్ర ప్రజలకు ఆందోళన కలిగించిన కరోనా నిన్న సాయంత్రం కాస్త శాంతించింది. కర్నూలు, గుంటూరు, నెల్లూరు జిల్లాలను బెంబేలెత్తించిన కరోనా నేటికి తెరిపినిచ్చింది.

గత రాత్రి 9 గంటల నుంచి నేటి ఉదయం 9 గంటల వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. మొత్తం 217 శాంపిల్స్ పరీక్షించగా అన్నీ నెగిటివ్ రిజల్ట్ వచ్చాయి. అయితే కరోనా తీవ్రత అధికంగా ఉన్న మూడు జిల్లాల్లో కఠిన ఆంక్షలు అమలులో ఉన్నాయి. రెడ్ జోన్లలో మున్సిపల్ సిబ్బంది హైప్లో క్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేస్తూ వైరస్ వ్యాప్తి కాకుండా చర్యలు చేపట్టారు. మరోవైపు ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

కాగా ప్రస్తుతం ఏపీలో 348 కేసులు నమోదయ్యాయి. వారందర్నీ ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. విశాఖపట్టణం జిల్లాలో కరోనా బారినపడిన నలుగురు కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కృష్ణా జిల్లా నుంచి ఇద్దరు, తూర్పు గోదావరి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల నుంచి ఒక్కొక్కరు ఆస్పత్రి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

Tags: corona virus, covid-19, andhrapradesh, amaravathi, vijayawada, health department

Tags:    

Similar News