3000 ఏళ్ల నాటి శవపేటికలు వెలికితీత.. అందులో ఈజిప్టు రాణి!
దిశ, వెబ్‌డెస్క్ : ఈజిప్టు దేశంలో పురావస్తు శాఖ వారు జరిపిన తవ్వకాల్లో 3000 ఏళ్ల నాటి శవపేటికలు లభ్యమయ్యాయి. వీటిని కైరోకు దక్షిణాన సక్కారా నెక్రోపోలిస్ వద్ద పురావస్తు శాఖ వారు కొనుగొన్నారు. ఇందులో 54 చెక్క శవపేటికలు బయటపడ్డాయి. వీటిలో చాలా వరకు 3,000 ఏళ్ల నాటి నుంచి ఈజిప్టు చివరి రాజ్యపాలన కాలం నాటివి కూడా ఉన్నట్లు గుర్తించారు. ఆ చెక్క పెట్టెలకు ప్రకాశవంతమైన రంగులు పెయింట్ చేయబడి ఉన్నాయి. అందువల్లే ఈ […]
దిశ, వెబ్‌డెస్క్ : ఈజిప్టు దేశంలో పురావస్తు శాఖ వారు జరిపిన తవ్వకాల్లో 3000 ఏళ్ల నాటి శవపేటికలు లభ్యమయ్యాయి. వీటిని కైరోకు దక్షిణాన సక్కారా నెక్రోపోలిస్ వద్ద పురావస్తు శాఖ వారు కొనుగొన్నారు. ఇందులో 54 చెక్క శవపేటికలు బయటపడ్డాయి. వీటిలో చాలా వరకు 3,000 ఏళ్ల నాటి నుంచి ఈజిప్టు చివరి రాజ్యపాలన కాలం నాటివి కూడా ఉన్నట్లు గుర్తించారు.
ఆ చెక్క పెట్టెలకు ప్రకాశవంతమైన రంగులు పెయింట్ చేయబడి ఉన్నాయి. అందువల్లే ఈ శవపేటికలు ఇన్నేళ్లు గడచినా ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయని పురావస్తు శాఖ అధికారులు వెల్లడించారు. అయితే, 54 శవ పేటికలతో పాటు ఈజిప్టు రాణి నీట్‌కు అంత్యక్రియలు నిర్వహించిన ప్రదేశం కూడా ఆమె భర్త కింగ్ టెటి పిరమిడ్ సమీపంలో కనుగొన్నట్లు తేలింది.