ఒకేసారి ముగ్గురు మృతి.. ఎక్కడా ? ఎందుకు ?

దిశ, వెబ్ డెస్క్: హిమచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆ రాష్ట్రమంతా అతలకుతలమైపోతోంది. గత కొద్ది రోజుల నుంచి కురుస్తున్న వర్షాల వల్ల ఆ రాష్ట్రంలోని చెరువులు, కుంటలు, వాగులు, వంకలు, నదులు పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలో లోతట్టు ప్రాంతాలు వరద నీటిలో కొట్టుకుపోతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా సహాయక చర్యలు కొనసాగిస్తూనే ఉన్నది. తాజాగా కుయ లోయకు కూరగాయలు […]

Update: 2020-08-13 21:31 GMT

దిశ, వెబ్ డెస్క్: హిమచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆ రాష్ట్రమంతా అతలకుతలమైపోతోంది. గత కొద్ది రోజుల నుంచి కురుస్తున్న వర్షాల వల్ల ఆ రాష్ట్రంలోని చెరువులు, కుంటలు, వాగులు, వంకలు, నదులు పొంగిపొర్లుతున్నాయి.

ఈ క్రమంలో లోతట్టు ప్రాంతాలు వరద నీటిలో కొట్టుకుపోతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా సహాయక చర్యలు కొనసాగిస్తూనే ఉన్నది. తాజాగా కుయ లోయకు కూరగాయలు తీసుకెళ్తుండగా ఓ ఘటన చోటు చేసుకుంది. కూరగాయల తీసుకెళ్తుండగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందారు. పలు వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. పలువురికి తీవ్ర గాయలయ్యాయి.

Tags:    

Similar News