ఆవుల దొంగతనం.. ముగ్గురు విదేశీయుల హతం

దిశ, వెబ్‌డెస్క్: పశువులను ఎత్తుకెళ్ళేందుకు యత్నించిన ముగ్గురు బంగ్లాదేశీయులు స్థానికుల చేతిలో హతమయ్యారు. అస్సాంలోని కరీంగంజ్ జిల్లాలో ఈ ఘటన శనివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. అయితే, పఠర్కండీ పీఎస్ పరిధిలోని బోగ్రిజన్ టీ ఎస్టేట్ ప్రాంతంలో ఇది వెలుగులోకి వచ్చింది. ఈ ప్రాంతం బంగ్లాదేశ్‌కు సరిహద్దుల్లో ఉంటుంది. మృతి చెందిన ముగ్గురితోపాటు వచ్చిన మరో నలుగురు పారిపోయారని పోలీసులు తెలిపారు. ఆవులను దొంగిలించే ఉద్దేశంతోనే బంగ్లాదేశీయులు సరిహద్దులను దాటారు. పశువులను దొంగిలించే క్రమంలో స్థానికులు ఆ […]

Update: 2020-07-19 11:38 GMT

దిశ, వెబ్‌డెస్క్: పశువులను ఎత్తుకెళ్ళేందుకు యత్నించిన ముగ్గురు బంగ్లాదేశీయులు స్థానికుల చేతిలో హతమయ్యారు. అస్సాంలోని కరీంగంజ్ జిల్లాలో ఈ ఘటన శనివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. అయితే, పఠర్కండీ పీఎస్ పరిధిలోని బోగ్రిజన్ టీ ఎస్టేట్ ప్రాంతంలో ఇది వెలుగులోకి వచ్చింది.

ఈ ప్రాంతం బంగ్లాదేశ్‌కు సరిహద్దుల్లో ఉంటుంది. మృతి చెందిన ముగ్గురితోపాటు వచ్చిన మరో నలుగురు పారిపోయారని పోలీసులు తెలిపారు. ఆవులను దొంగిలించే ఉద్దేశంతోనే బంగ్లాదేశీయులు సరిహద్దులను దాటారు. పశువులను దొంగిలించే క్రమంలో స్థానికులు ఆ ముగ్గురిని పట్టుకుని కొట్టి చంపారు. మరో నలుగురు పరారయ్యారు. ముగ్గురిని చంపిన వారి కోసం గాలిస్తున్నామని కరీంగంజ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సంజిత్ కృష్ణ తెలిపారు.

బంగ్లాదేశ్‌లో తయారైన బిస్కెట్లు, బ్రెడ్ తోపాటు తాళ్లు, ఫెన్స్ కట్టర్, బ్యాగ్, వైర్లను ఘటనా స్థలంలో స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సరిహద్దు భద్రతా దళాల ద్వారా బంగ్లాదేశీ మృత దేహాలను ఆ దేశ అధికారులకు అందించనున్నట్లు చెప్పారు. కాగా, బంగ్లాదేశ్ నుంచి వచ్చి కరీంగంజ్ ప్రాంతంలో పశువులను ఎత్తుకెళ్లే ప్రక్రియ ఇక్కడ సాధారణంగా మారిపోయిందని స్థానికులు చెబుతున్నారు.

Tags:    

Similar News