భద్రాచలంలో మూడో హెచ్చరిక లేనట్లే!
దిశ ప్రతినిధి, ఖమ్మం : గోదావరికి వరద ఉధృతి కొనసాగుతోంది. భద్రాచలం వద్ద 51 అడుగుల నీటి మట్టంతో 13లక్షల పై చిలుకు క్యూసెక్కుల వేగంతో వరదనీరు దిగువ ప్రాంతానికి ప్రవహిస్తోంది. శనివారం మధ్యాహ్నం 52 అడుగులకు నీటి మట్టం చేరుకోవడంతో మూడో ప్రమాద హెచ్చరికను అధికారులు రద్దు చేశారు. ప్రస్తుతం రెండో హెచ్చరికనే కొనసాగుతోంది. ఆదివారం తెల్లవారు జామున 47అడుగుల కంటే తక్కువకు నీటి మట్టం చేరుకునే అవకాశం ఉందని సీడబ్ల్యూసీ అధికారులు ఒక ప్రకటనలో […]
దిశ ప్రతినిధి, ఖమ్మం : గోదావరికి వరద ఉధృతి కొనసాగుతోంది. భద్రాచలం వద్ద 51 అడుగుల నీటి మట్టంతో 13లక్షల పై చిలుకు క్యూసెక్కుల వేగంతో వరదనీరు దిగువ ప్రాంతానికి ప్రవహిస్తోంది.
శనివారం మధ్యాహ్నం 52 అడుగులకు నీటి మట్టం చేరుకోవడంతో మూడో ప్రమాద హెచ్చరికను అధికారులు రద్దు చేశారు. ప్రస్తుతం రెండో హెచ్చరికనే కొనసాగుతోంది. ఆదివారం తెల్లవారు జామున 47అడుగుల కంటే తక్కువకు నీటి మట్టం చేరుకునే అవకాశం ఉందని సీడబ్ల్యూసీ అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.