కరోనా అలర్ట్.. ఎంజీఎంలో 24 గంటల్లో 27 మంది మృతి..

దిశ, పోచమ్మమైదాన్ : ప్రాణాంతక మహమ్మారి కరోనా.. కరాళ నృత్యం చేస్తోంది. గడిచిన 24 గంటల్లో వరంగల్ జిల్లాలోని ఎంజీఎం ఆసుపత్రిలో ఉన్న కోవిడ్ వార్డులో 27 మంది రోగులు ప్రాణాలు వదిలారు. కోవిడ్ వార్డు ఇప్పటికే రోగులతో కిక్కిరిసిపోయింది. రోగులు తమకు ఇష్టమొచ్చినట్లు నడుచుకుంటున్నారు. కరోనా పాజిటివ్ అని తెలిసినా కూడా మందులకు, టిఫిన్ సెంటర్లకు నేరుగా వెళ్లి వస్తున్నారు. దీంతో రోగులను వైద్య సిబ్బంది కట్టడి చేయలేకపోతున్నారు. పరివేక్షణ కొరత కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఇప్పుటికే […]

Update: 2021-04-28 02:22 GMT

దిశ, పోచమ్మమైదాన్ : ప్రాణాంతక మహమ్మారి కరోనా.. కరాళ నృత్యం చేస్తోంది. గడిచిన 24 గంటల్లో వరంగల్ జిల్లాలోని ఎంజీఎం ఆసుపత్రిలో ఉన్న కోవిడ్ వార్డులో 27 మంది రోగులు ప్రాణాలు వదిలారు. కోవిడ్ వార్డు ఇప్పటికే రోగులతో కిక్కిరిసిపోయింది. రోగులు తమకు ఇష్టమొచ్చినట్లు నడుచుకుంటున్నారు. కరోనా పాజిటివ్ అని తెలిసినా కూడా మందులకు, టిఫిన్ సెంటర్లకు నేరుగా వెళ్లి వస్తున్నారు. దీంతో రోగులను వైద్య సిబ్బంది కట్టడి చేయలేకపోతున్నారు. పరివేక్షణ కొరత కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.

ఇప్పుటికే పదుల సంఖ్యలో మృత్యువాత పడ్డారు.. మరి కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా రోగులకు చికిత్స అందించే విషయంలో కొందరు వైద్య సిబ్బంది భయపడుతున్నట్లు
సమాచారం. వేయి పడకల మల్టీ సూపర్ స్పెషాలిటి ఆస్పత్రిగా పేరున్న ఎంజీఎం ఆసుపత్రి పేరు విని.. లోపలికి రావాలంటే ఇతర వైద్య సేవల కోసం వచ్చే వారు భయపడుతున్నారు. ఎప్పుడూ రోగుల రాకపోకలతో సందడిగా కనిపించే ఎంజీఎం దవాఖాన.. కరోనా కారణంగా నిర్మానుష్యంగా మారింది.

 

Tags:    

Similar News