సహాయక చర్యల్లో పాల్గొన్న కలెక్టర్ సహా 22 మందికి కరోనా
తిరువనంతపురం: కోళికోడ్ విమాన ప్రమాదంలో సహాయక చర్యల్లో పాల్గొన్న కలెక్టర్, అసిస్టెంట్ కలెక్టర్, ఎస్పీలు సహా 22 మంది అధికారులకు కరోనా పాజటివ్ అని తేలింది. వందేభారత్ మిషన్‌లో భాగంగా దుబాయ్ నుంచి 184 మంది ప్రయాణికులతో కేరళ వచ్చిన విమానం గతవారం కోళికోడ్ విమానాశ్రయంలో ప్రమాదంలో రెండు ముక్కలైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు సహా స్థానికులు పెద్దపెట్టున వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్న 22 […]
తిరువనంతపురం: కోళికోడ్ విమాన ప్రమాదంలో సహాయక చర్యల్లో పాల్గొన్న కలెక్టర్, అసిస్టెంట్ కలెక్టర్, ఎస్పీలు సహా 22 మంది అధికారులకు కరోనా పాజటివ్ అని తేలింది. వందేభారత్ మిషన్‌లో భాగంగా దుబాయ్ నుంచి 184 మంది ప్రయాణికులతో కేరళ వచ్చిన విమానం గతవారం కోళికోడ్ విమానాశ్రయంలో ప్రమాదంలో రెండు ముక్కలైన సంగతి తెలిసిందే.
ఈ ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు సహా స్థానికులు పెద్దపెట్టున వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్న 22 మంది అధికారులకు కరోనా పాజిటివ్ తేలినట్టు మలప్పురం మెడికల్ ఆఫీసర్లు వెల్లడించారు. ఇందులో మలప్పురం జిల్లా కలెక్టర్ కే గోపాలక్రిష్ణన్, ఎస్పీ యూ అబ్దుల్ కరీంలు, అసిస్టెంట్ కలెక్టర్‌లూ ఉన్నారు. కలెక్టర్, ఎస్పీ, అసిస్టెంట్ కలెక్టర్లు ఘటనాస్థలానికి వచ్చిన వీవీఐపీలతో సన్నిహితంగా మెలిగినట్టు తెలిసింది. విమాన ప్రమాద స్థలికి రాష్ట్ర సీఎం పినరయి విజయన్, ఆరోగ్య మంత్రి కేకే శైలజా సహా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి, సహాయ మంత్రి మురళీధరన్‌లూ పర్యటించిన విషయం తెలిసిందే.