రిస్కులో 20 మంది విద్యార్థుల జీవితాలు..!
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో కరోనా మహమ్మారి విస్తరణ క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో తాజాగా 20 మంది విద్యార్థులు కరోనా వైరస్ బారిన పడ్డారు. ఈ ఘటన విజయనగరం జిల్లాలోని గంట్యాడ జెడ్పీ స్కూల్లో శనివారం వెలుగులోకి వచ్చింది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. ఇన్నిరోజులు డిజిటల్ పాఠాలు నిర్వహించిన ఏపీ ప్రభుత్వం అన్‌లాక్ 5.0లో భాగంగా స్కూళ్లు ప్రారంభించుకోవచ్చునని కేంద్ర హోంశాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. అది కూడా పేరెంట్స్ ఇష్టముంటేనే పిల్లలను స్కూళ్లకు […]
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో కరోనా మహమ్మారి విస్తరణ క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో తాజాగా 20 మంది విద్యార్థులు కరోనా వైరస్ బారిన పడ్డారు. ఈ ఘటన విజయనగరం జిల్లాలోని గంట్యాడ జెడ్పీ స్కూల్లో శనివారం వెలుగులోకి వచ్చింది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు.
ఇన్నిరోజులు డిజిటల్ పాఠాలు నిర్వహించిన ఏపీ ప్రభుత్వం అన్‌లాక్ 5.0లో భాగంగా స్కూళ్లు ప్రారంభించుకోవచ్చునని కేంద్ర హోంశాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. అది కూడా పేరెంట్స్ ఇష్టముంటేనే పిల్లలను స్కూళ్లకు పంపించుకోవచ్చని స్పష్టం చేసింది. అయితే, కొంతమంది విద్యార్థులకు డిజిటల్ తరగతులు వినేందుకు సౌకర్యాలు లేవు. దీంతో వారు పాఠశాలకు వచ్చి పాఠాలు వింటున్నారు. ఈ క్రమంలోనే నిర్వహించిన కరోనా టెస్టులో 20 మంది కరోనా బారిన పడటంతో ఉపాధ్యాయులతో పాటు విద్యార్థుల పేరెంట్స్ ఆందోళనకు గురవుతున్నారు.