భారీ భూకంపం.. 20 మంది మృతి
దిశ, వెబ్ డెస్క్: భూకంపం సంభవించి 20 మంది మృతి చెందిన ఘటన పాకిస్థాన్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పాకిస్థాన్ లోని బలూచిస్థాన్ సహా పలు ప్రాంతాల్లో గురువారం తెల్లవారుజామున భూమి కంపించింది. దీంతో ఆ ప్రాంతాల్లోని ఇళ్ల పైకప్పులు, గోడలు కూలిపోయాయి. 20 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మరికొంతమంది ఇంకా శిథిలాల కిందే ఉన్నారు. వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడినవారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. […]
దిశ, వెబ్ డెస్క్: భూకంపం సంభవించి 20 మంది మృతి చెందిన ఘటన పాకిస్థాన్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పాకిస్థాన్ లోని బలూచిస్థాన్ సహా పలు ప్రాంతాల్లో గురువారం తెల్లవారుజామున భూమి కంపించింది. దీంతో ఆ ప్రాంతాల్లోని ఇళ్ల పైకప్పులు, గోడలు కూలిపోయాయి. 20 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మరికొంతమంది ఇంకా శిథిలాల కిందే ఉన్నారు. వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడినవారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం హర్నాయ్‌లోని అన్ని ఆసుపత్రులలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. రిక్టర్ స్కేల్ పై భూకంపం తీవ్రత 5.7 గా నమోదైంది.