భయం గుప్పిట్లో గుంటూరు..20 కేసులు

గుంటూరు జిల్లా కరోనా భయంతో వణుకుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని అత్యధిక కేసులు గుంటూరు జిల్లా నుంచి నమోదు కావడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. రాష్ట్రంలో కరోనా వెలుగు చూసిన తొలినాళ్లలో విశాఖపట్టణం ఆందోళన చెందింది. ఏపీ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌కు కరోనా ఎంత నష్టం కలిగిస్తుందోనని అంత భయబ్రాంతులకు గురయ్యారు. అయితే వైజాగ్ ఛెస్ట్ ఆసుపత్రి సిబ్బంది పట్టుదల, రోగి ధైర్యం ముందు కరోనా తలవంచింది. దీంతో కరోనాతో ఆసుపత్రిలో చేరిన బాధితుడు వయసు పైబడ్డప్పటకీ డిశ్చార్జ్ అయి ఆదర్శంగా […]

Update: 2020-04-02 01:41 GMT

గుంటూరు జిల్లా కరోనా భయంతో వణుకుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని అత్యధిక కేసులు గుంటూరు జిల్లా నుంచి నమోదు కావడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. రాష్ట్రంలో కరోనా వెలుగు చూసిన తొలినాళ్లలో విశాఖపట్టణం ఆందోళన చెందింది. ఏపీ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌కు కరోనా ఎంత నష్టం కలిగిస్తుందోనని అంత భయబ్రాంతులకు గురయ్యారు. అయితే వైజాగ్ ఛెస్ట్ ఆసుపత్రి సిబ్బంది పట్టుదల, రోగి ధైర్యం ముందు కరోనా తలవంచింది.

దీంతో కరోనాతో ఆసుపత్రిలో చేరిన బాధితుడు వయసు పైబడ్డప్పటకీ డిశ్చార్జ్ అయి ఆదర్శంగా నిలిచాడు. దీంతో వైజాగ్ ఆసుపత్రుల్లో ధైర్యం పెరిగింది. అయితే ఏపీలో ఊహించని విధంగా మూడు రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ప్రధానంగా గుంటూరు జిల్లాలో కరోనా కేసులు ఊహించని విధంగా పెరుగుతూ వైద్యాధికారులకు సవాల్ విసురుతున్నాయి. ఒక్క గుంటూరు జిల్లాలోనే 20 కేసులు నమోదయ్యాయంటే అక్కడి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.

అయితే ఈ కేసుల్లో మెజారిటీ ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో నిర్వహించిన తబ్లిగి జమాత్ మర్కజ్‌లో పాల్గొన్న వారికే సోకడం విశేషం. ఇది జిల్లాకు కొంత ఊరట కలిగిస్తున్నప్పటికీ.. గుంటూరులో కరోనా సోకుతున్న వర్గం ప్రజలు గణనీయంగానే ఉన్నారు. అయితే కరోనా గత నెల 13 నుంచి 15వ తేదీ లోపు సోకగా ఇన్నాళ్టికి బయటపడుతోంది. ఇదే ప్రమాదకంగా మారుతోంది. ఇప్పటికే వారితో సన్నిహిత సంబంధాలు నెరిపిన వారికి సోకి ఉంటే మరో వారం రోజులకు కానీ బయటపడే అవకాశం లేదు. అలా జరిగితే వారు ఎంతమందికి? వారి నుంచి ఎంతమందికి సోకిందన్న సంగతి చెప్పడం కష్టమని అధికారులు చెబుతున్నారు. దీంతోనే గుంటూరు వాసుల్లో భయం గూడుకట్టుకుని ఉంది.

Tags: coronavirus, guntur district, covid-19, tablighi jamaat markaz, muslim

Tags:    

Similar News