Elephant: ఒంటరిగా వెళ్లి బీభత్సం.. ఆవు అక్కడికక్కడే మృతి

చిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు హల్ చల్ చేసింది....

Update: 2025-03-27 10:52 GMT
Elephant: ఒంటరిగా వెళ్లి బీభత్సం.. ఆవు అక్కడికక్కడే మృతి
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: చిత్తూరు జిల్లా(Chittoor District)లో ఒంటరి ఏనుగు(Elephant) హల్ చల్ చేసింది. మాదమర్రి మండలం దలవాయిపల్లి(Dalavayipalli)లో బీభత్సం సృష్టించింది. స్థానిక అటవీ ప్రాంతం నుంచి పంట పొలాలు వైపు వెళ్లి పెద్ద పెద్దగా ఘీంకారాలు చేసింది. అంతటితో ఆగకుండా ఆవు(Cow)పై దాడి చేసింది. ఈ దాడిలో ఆవు అక్కడికక్కడే మృతి చెందింది. అంతేకాకుండా స్థానికంగా ఉన్న పంట పొలాల్లో విధ్వంసం సృష్టించింది. అరటి పంటలతో పాటు వరి, స్థానికంగా ఉన్న బోరు పైపులను సైతం ధ్వంసం చేసింది.

దీంతో స్థానికల ప్రజలు హడలిపోతున్నారు. ఒంటరి ఏనుగుతో తమకు ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ పంట పొలాలు తరచూ ఏనుగుల దాడులకు గురవుతున్నాయని, వాటి నుంచి శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు. ఎన్నో సార్లు అధికారులకు మొర పెట్టుకున్నా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా అధికారులు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

మరోవైపు విషయం తెలుసుకున్న అటవీ శాఖ సిబ్బంది.. స్థానికులను అలర్ట్ చేశారు. అటవీ ప్రాంతంలోకి ఏనుగును తరిమేవరకు రైతులు ఒంటరిగా పొలాలకు వెళ్లొద్దని, గుంపులుగా వెళ్లాలని సూచించారు. చేతుల్లో కర్రలతో తిరగాలని చెప్పారు. ఒంటరి ఏనుగును వెంటనే అక్కడి నుంచి తరిమేస్తామని అటవీ శాఖ అధికారులు తెలిపారు.

Tags:    

Similar News