రూ.కోటికి లెక్కేది..మావోయిస్టుల కోసమేనా అదంతా?

దిశ, కరీంనగర్: మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతమైనా గడ్చిరోలి జిల్లా సిరొంచ తాలుకా పోలీసులు రెండు వాహనాల్లో పెద్ద ఎత్తున తరలిస్తున్న సొమ్మును పట్టుకున్నారు.ఈ వ్యవహారం అంతా ఓ తునికాకు కాంట్రాక్టర్ నడిపిస్తున్నట్టు తేలింది. పట్టుబడిన రూ.2.20 కోట్ల నగదులో రూ. కోటికి సంబంధించిన రశీదులు మాత్రమే లభ్యమైనాయి. మిగతా నగదు లావాదేవీలకు చెందిన రశీదులు, పత్రాలు లభ్యం కాకపోవడంతో నిందితులను సిరోంచ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం టీఎస్ 11 EN 0001 ఇన్నోవా, ఎంహెచ్ 34BF […]

Update: 2020-06-04 06:13 GMT
రూ.కోటికి లెక్కేది..మావోయిస్టుల కోసమేనా అదంతా?
  • whatsapp icon

దిశ, కరీంనగర్: మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతమైనా గడ్చిరోలి జిల్లా సిరొంచ తాలుకా పోలీసులు రెండు వాహనాల్లో పెద్ద ఎత్తున తరలిస్తున్న సొమ్మును పట్టుకున్నారు.ఈ వ్యవహారం అంతా ఓ తునికాకు కాంట్రాక్టర్ నడిపిస్తున్నట్టు తేలింది. పట్టుబడిన రూ.2.20 కోట్ల నగదులో రూ. కోటికి సంబంధించిన రశీదులు మాత్రమే లభ్యమైనాయి. మిగతా నగదు లావాదేవీలకు చెందిన రశీదులు, పత్రాలు లభ్యం కాకపోవడంతో నిందితులను సిరోంచ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం టీఎస్ 11 EN 0001 ఇన్నోవా, ఎంహెచ్ 34BF 7221 స్కార్పియో వాహనాలతో పాటు, నగదును కూడా సీజ్ చేశారు. అరెస్టైన వారిలో వరంగల్ ఎల్‌బీ నగర్‌కు చెందిన ఎండీ భాషూ మీయా, అలీయోద్దీన్, మహారాష్ట్రాకు చెందిన సుధీర్ రావులు ఉన్నారు.అయితే వీరు అనధికారికంగా తీసుకెళ్తున్న నగదు మావోయిస్టులకు చందాలు అందించడానికేనా..అన్న కోణంలో విచారణ జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు.

చెక్ పోస్టులు ఉన్నా..

కరోనా వ్యాప్తి కారణంగా అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో ఆయా రాష్ట్రాల పోలీసు యంత్రాంగం ప్రత్యేకంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేసింది.అయినప్పటికీ కొందరు అక్రమార్కులు దర్జాగా డబ్బులు తీసుకెళ్తుండటం గమనార్హం. మహారాష్ట్ర పోలీసులు అలెర్ట్‌గా ఉండి వాహనాలను తనిఖీ చేయడంతో తునికాకు కాంట్రాక్టర్ గుట్టు రట్టయింది.

Tags:    

Similar News