పండగ ఎఫెక్ట్..జోరుగా సాగిన గొర్రెల అంగడి..

సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్

Update: 2025-01-14 07:45 GMT
పండగ ఎఫెక్ట్..జోరుగా సాగిన గొర్రెల అంగడి..
  • whatsapp icon

దిశ,ఎల్లారెడ్డిపేట : సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామంలో జరుగుతున్న గొర్రెలు, మేకల అంగడి కి ఎల్లారెడ్డిపేట,వీర్నపల్లి, ముస్తాబాద్,గంభీరావుపేట, సిరిసిల్ల మండలాల నుంచి పదుల సంఖ్యలో వివిధ గ్రామాల నుండి ప్రజలు వచ్చి గొర్రెలు, మేకలు వందల సంఖ్యలో కొనుగోలు చేసుకున్నారు. పది మంది చొప్పున ప్రతి ఒక్క కుల సంఘం నుండి తలా కొన్ని రూపాయలు జమ చేసుకొని కొనుగోలు చేసుకుని గ్రామ దేవతల వద్ద మొక్కులు చెల్లించుకున్నారు. ధరలు పెంచి అమ్మిన దళారులు. సంక్రాంతి పండగను ఆసరాగా చేసుకున్న గొర్రెలు, మేకల దళారులు నిజామాబాద్, మాచారెడ్డి, కరీంనగర్, జగిత్యాల జిల్లాల నుండి గొర్రెలు మేకలు తెచ్చిన దళారులు ఇష్టారీతిగా ధరలు పెంచి అమ్ముకుని లక్షల రూపాయలు గొర్రెల మేకల దళారులు లక్షల్లో సొమ్ము చేసుకున్నారు.


Similar News