కౌశిక్ రెడ్డి క్యారెక్టర్ వెరీ బ్యాడ్..: వేములవాడ ఎమ్మెల్యే

కౌశిక్ రెడ్డి ఎపిసోడ్, క్యారెక్టర్ వెరీ బ్యాడ్ అని, అధికార

Update: 2025-01-14 07:49 GMT
కౌశిక్ రెడ్డి క్యారెక్టర్ వెరీ బ్యాడ్..: వేములవాడ ఎమ్మెల్యే
  • whatsapp icon

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : కౌశిక్ రెడ్డి ఎపిసోడ్, క్యారెక్టర్ వెరీ బ్యాడ్ అని, అధికార కార్యక్రమంలో సంజయ్ పై తిట్ల పురాణం, దాడి హేయమైన చర్య అని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ విమర్శించారు. హుజూరాబాద్ ఎమ్మేల్యే పాడి కౌశిక్ రెడ్డి బెయిల్ పై స్పందిస్తూ ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. మొన్న కరీంనగర్ లో జరిగిన ఉమ్మడి కరీంనగర్ సమావేశంలో ప్రభుత్వ పథకాలపై చర్చ కొనసాగుతుండగా కౌశిక్ రెడ్డి వ్యవహరించిన తీరును తప్పుపట్టారు. అధికారిక సమావేశంలో కౌశిక్ రెడ్డి ఒక గౌరవ ప్రదమైన శాసనసభ్యుడి హోదాలో ఉండి మరో శాసనసభ్యుడు సంజయ్ పై తిట్ల పురాణంతో దాడికి పాల్పడటం శాసనసభ్యుడి హక్కులకు భంగం కలిగించే విధంగా ఉందని మండిపడ్డారు.

సమావేశంలో బండబూతులు తిడుతూ దాడికి పాల్పడితే తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. సభ హుందాతనాన్ని అవమానపరిచేలా, ప్రజా ప్రతినిధులను బూతులు తిడుతూ కించపరిచిన కౌశిక్ రెడ్డి పై స్పీకర్, ఆర్డిఓ కేసు పెడితే తప్పేంటని ప్రశ్నించారు. చట్టం తన పని తను చేసుకుపోతుందని, చట్టంలో ఉన్న లొసుగులతో కౌశిక్ రెడ్డికి బెయిల్ వచ్చి ఉంటుందని తెలిపారు. శాసనసభ్యుని అవమాన పరచడమే బీఆర్ఎస్ పార్టీ విధానమా అని, దీనికి ఫామ్ హౌస్ లో ఉన్న కేసీఆరే సమాధానం చెప్పాలని సవాలు విసిరారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ నేతలు తమ ప్రవర్తనను మార్చుకోకపోతే స్పీకర్ చట్టపరనమైన చర్యలు తీసుకుంటారని భావించారు.


Similar News