కోరుట్ల బస్ డిపోలో నిలిచిన అద్దె బస్సు సేవలు... !
కోరుట్ల బస్ డిపోలో అద్దె బస్సు సేవలు మంగళవారం ఉదయం
దిశ,కోరుట్ల టౌన్ : కోరుట్ల బస్ డిపోలో అద్దె బస్సు సేవలు మంగళవారం ఉదయం నుంచి నిలిచిపోయాయి. డిపోలో ఉన్న అద్దె బస్సు డ్రైవర్లు తమకు వేతనాలు రూ.15 వేలు ఉండగా యజమానులు ఇచ్చిన ఒప్పందం ప్రకారం రూ. 18 వేలకు పెంచాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. సంక్రాంతి పండుగ పూట ఉదయం నుంచి బస్సులు కదలక పోవడంతో పల్లె గ్రామాలకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడుతూ ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. అద్దె బస్సుల యజమానులు డ్రైవర్లతో మంతనాలు జరుపుతున్నారు. ఈ విషయమై డిపో మేనేజర్ మనోహర్ ను వివరణ కోరగా ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.