బ్రిటిష్ ఫుట్‌బాల్ లెజెండ్ చార్లటన్ మృతి

దిశ, స్పోర్ట్స్: ఫుట్‌బాల్ లెజెండరీ ఆటగాడు జాక్ చార్లటన్ మృతిచెందారు. 1966లో ఫుట్‌బాల్ ప్రపంచకప్ గెలిచిన ఇంగ్లండ్ జట్టులో ఆయన సభ్యుడు. గత కొన్నేళ్లుగా జాక్ లింఫోమా కాన్సర్, డిమెన్షియాతో బాధపడుతున్నారని, వ్యాధి తీవ్రత పెరగడంతో మృతిచెందారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మనుమరాలు, జర్నలిస్ట్ ఎమ్మా విల్కిన్సన్ ట్విట్టర్‌ ద్వారా మృతిని ధ్రువీకరించి, నివాళులర్పించారు. ‘తాతయ్య జాక్ మరణించడం చాలా బాధగా ఉంది. ఆయన ఒక ఫుట్‌బాల్ లెజెండ్. ఎంతో మంచి వ్యక్తి.. చాలా సరదాగా […]

Update: 2020-07-11 09:00 GMT

దిశ, స్పోర్ట్స్: ఫుట్‌బాల్ లెజెండరీ ఆటగాడు జాక్ చార్లటన్ మృతిచెందారు. 1966లో ఫుట్‌బాల్ ప్రపంచకప్ గెలిచిన ఇంగ్లండ్ జట్టులో ఆయన సభ్యుడు. గత కొన్నేళ్లుగా జాక్ లింఫోమా కాన్సర్, డిమెన్షియాతో బాధపడుతున్నారని, వ్యాధి తీవ్రత పెరగడంతో మృతిచెందారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మనుమరాలు, జర్నలిస్ట్ ఎమ్మా విల్కిన్సన్ ట్విట్టర్‌ ద్వారా మృతిని ధ్రువీకరించి, నివాళులర్పించారు. ‘తాతయ్య జాక్ మరణించడం చాలా బాధగా ఉంది. ఆయన ఒక ఫుట్‌బాల్ లెజెండ్. ఎంతో మంచి వ్యక్తి.. చాలా సరదాగా ఉండేవారు. ఆయన అందించిన జ్ఞాపకాలకు కృతజ్ఞతలు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను ‘ అని ఆమె ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఇంగ్లండ్ జాతీయ జట్టుకే కాకుండా లీడ్స్ యునైటెడ్‌కు 21ఏళ్లపాటు ఆయన సేవ చేశారు. 773 మ్యాచ్‌లు ఆడిన జాక్, 1973లో ఆటకు గుడ్ బై చెప్పారు. అనంతరం రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్ మేనేజర్‌గా దశాబ్దంపాటు సేవలందించారు. ఇటలీలో జరిగిన 1990 ప్రపంచకప్‌లో జట్టును క్వార్టర్ ఫైనల్స్‌కు తీసుకెళ్లిన ఘనత ఆయన సొంతం. కుటుంబంతోపాటు జాక్ నార్తమ్‌బెర్లాండ్‌లో ఉండేవారు.

Tags:    

Similar News