హర్రర్.. ఘోర రోడ్డు ప్రమాదం.. 19 మంది మృతి
దిశ, వెబ్‌డెస్క్ : మెక్సికోలో ఘోర విషాద ఘటన చోటుచేసుకుంది. సెంట్రల్ మెక్సికోలో టూరిస్టు బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 19 మంది మృతి చెందగా మరో 32 మంది గాయపడ్డారు. వివరాల ప్రకారం.. సెంట్రల్ మెక్సికోలో యాత్రికులతో వెళ్తున్న ఓ బస్సు జోక్విసింగో టౌన్‌షిప్‌లో ప్రమాదానికి గురైంది. బస్సు హై స్పీడ్‌లో వెళ్తుండగా బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. ఈ క్రమంలోనే ప్రమాదం జరిగినట్టు అధికారులు తెలిపారు. డిసెంబర్ 12న జరుపుకునే ‘వర్జిన్ ఆఫ్ గ్వడెలోప్’ […]
దిశ, వెబ్‌డెస్క్ : మెక్సికోలో ఘోర విషాద ఘటన చోటుచేసుకుంది. సెంట్రల్ మెక్సికోలో టూరిస్టు బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 19 మంది మృతి చెందగా మరో 32 మంది గాయపడ్డారు. వివరాల ప్రకారం.. సెంట్రల్ మెక్సికోలో యాత్రికులతో వెళ్తున్న ఓ బస్సు జోక్విసింగో టౌన్‌షిప్‌లో ప్రమాదానికి గురైంది. బస్సు హై స్పీడ్‌లో వెళ్తుండగా బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. ఈ క్రమంలోనే ప్రమాదం జరిగినట్టు అధికారులు తెలిపారు.
డిసెంబర్ 12న జరుపుకునే ‘వర్జిన్ ఆఫ్ గ్వడెలోప్’ సమీపిస్తున్న నేపథ్యంలో మెక్సికన్లు పుణ్యక్షేత్రాలను దర్శిస్తుంటారు. ఈ క్రమంలోనే మిచోకాన్ అనే ప్రాంతం నుంచి రోమన్ క్యాథలిక్ యాత్రికులు సందర్శించే చల్మా పట్టణానికి ఈ బస్సు బయలుదేరింది. దురదృష్టవశాత్తు ఈ ప్రమాదం జరిగింది.