విశాఖ ఎయిర్‌పోర్టులో మెడికల్ అలర్ట్
మలేషియాలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్న దేశాల్లో మలేషియా కూడా ఉంది. అయితే ఆ దేశ రాజధాని కౌలాలంపూర్‌లో చిక్కుకున్న186మంది భారతీయులను మన దేశానికి తీసుకు వచ్చేందుకు విదేశాంగ శాఖ చర్యలు చేపట్టింది. ఎయిర్ ఏషియా-380 విమానంలో వారందని ఎక్కించుకుని నేరుగా విశాఖ ఎయిర్ పోర్టుకు తీసుకురానున్నారు. దీంతో వైజాగ్ ఎయిర్ పోర్టులో వైద్య అధికారుల బృందం అప్రమత్తమైంది.కౌలాలంపూర్ నుంచి వచ్చిన ప్రయాణికులందరికి ముందుగా వైరస్ […]
మలేషియాలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్న దేశాల్లో మలేషియా కూడా ఉంది. అయితే ఆ దేశ రాజధాని కౌలాలంపూర్‌లో చిక్కుకున్న186మంది భారతీయులను మన దేశానికి తీసుకు వచ్చేందుకు విదేశాంగ శాఖ చర్యలు చేపట్టింది. ఎయిర్ ఏషియా-380 విమానంలో వారందని ఎక్కించుకుని నేరుగా విశాఖ ఎయిర్ పోర్టుకు తీసుకురానున్నారు. దీంతో వైజాగ్ ఎయిర్ పోర్టులో వైద్య అధికారుల బృందం అప్రమత్తమైంది.కౌలాలంపూర్ నుంచి వచ్చిన ప్రయాణికులందరికి ముందుగా వైరస్ టెస్ట్‌లు నిర్వహించాక.. వారికి ఎటువంటి వైరస్ లేదని తేలాకే వారిని అనుమతించనున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ వైరస్ పాజిటివ్ అని తేలితే వారిని వెంటనే హాస్పిటల్స్‌కు తరలించేందుకు 5అంబులెస్స్‌లను, 15బస్సులను ఇప్పటికే అందుబాటులో ఉంచారు.
tags;corona, malaysia, kuala lumpur, 186 indians, vizag, airasia-a380 aeroplane