ఏపీ పోలీసులపై భారీగా కేసులు

దిశ, ఏపీ బ్యూరో: దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీ పోలీసులపై గతేడాది పెద్ద ఎత్తున కేసులు నమోదయ్యాయి. 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పోలీసులపై నమోదైన కేసులన్నీ కలిపితే 4,068 ఉన్నాయి. ఇందులో ఒక్క ఏపీ పోలీసులపైనే ఏకంగా 1,681 కేసులు నమోదైనట్లు జాతీయ నేర గణాంకాల నివేదిక బయటపెట్టింది. రెండు తెలుగు రాష్ట్రాల కన్నా పెద్దదైన మహారాష్ట్ర పోలీసులపై 403 కేసులున్నాయి. ఏపీ పోలీసులపై నమోదైన 1,681 కేసుల్లో 302 కేసులకు సంబంధించి దర్యాప్తు […]

Update: 2020-10-03 10:34 GMT

దిశ, ఏపీ బ్యూరో: దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీ పోలీసులపై గతేడాది పెద్ద ఎత్తున కేసులు నమోదయ్యాయి. 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పోలీసులపై నమోదైన కేసులన్నీ కలిపితే 4,068 ఉన్నాయి. ఇందులో ఒక్క ఏపీ పోలీసులపైనే ఏకంగా 1,681 కేసులు నమోదైనట్లు జాతీయ నేర గణాంకాల నివేదిక బయటపెట్టింది. రెండు తెలుగు రాష్ట్రాల కన్నా పెద్దదైన మహారాష్ట్ర పోలీసులపై 403 కేసులున్నాయి. ఏపీ పోలీసులపై నమోదైన 1,681 కేసుల్లో 302 కేసులకు సంబంధించి దర్యాప్తు పూర్తి చేసి కోర్టుల్లో చార్జిషీట్లు దాఖలు చేసినట్లు ఎన్‌సీఆర్‌బీకి పోలీసుశాఖ వివరాలు తెలిపింది.

Tags:    

Similar News