భారత్‌లో 16వేలకు పైగా కరోనా కేసులు

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దేశంలో మళ్లీ 15 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. గురువారం ఉదయం కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం.. తాజాగా గత 24 గంటల్లో 16,738 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి అదే సమయంలో 11,799 మంది కోలుకున్నారు. బుధవారం ఒక్కరోజే 138 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,10,46,914కు […]

Update: 2021-02-24 23:43 GMT

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దేశంలో మళ్లీ 15 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. గురువారం ఉదయం కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం.. తాజాగా గత 24 గంటల్లో 16,738 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి అదే సమయంలో 11,799 మంది కోలుకున్నారు. బుధవారం ఒక్కరోజే 138 మంది ప్రాణాలు కోల్పోయారు.

దీంతో దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,10,46,914కు చేరింది. ఇప్పటిరకు 1,56,705 మంది మృతి చెందారు. దేశంలో ప్రస్తుతం 1,51,708 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 1,07,38,501 మంది డిశ్చార్జ్ అయ్యారు. కరోనా వ్యాక్సినేషన్‌లో భాగంగా ఇప్పటివరకు 1,26,71,163 మంది టీకా తీసుకున్నట్లు పేర్కొంది.

Tags:    

Similar News