ముక్కిపోయిన 16,000 బ్యాగుల బియ్యం

        దాచి దాచి దయ్యాలపాలు చేశారన్నట్టు కొందరు ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యంతో 16 వేల గోనె సంచుల బియ్యం పాడైపోయింది. కొన్ని నెలలపాటు వందల పేద కుటుంబాల ఆకలి తీర్చగలిగిన బియ్యం గోడౌన్‌కే పరిమితం చేయడంతో ముక్కిపోయింది. ప్రభుత్వ పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు అందించేందుకు ఉద్దేశించిన ఈ బియ్యాన్ని ఇప్పుడు ‘రీసైకిల్’ చేస్తామని కొందరు అధికారులు పేర్కొన్నట్టు తెలిసింది. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని బలరాంపూర్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. కాగా, ఈ […]

Update: 2020-02-14 02:08 GMT

దాచి దాచి దయ్యాలపాలు చేశారన్నట్టు కొందరు ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యంతో 16 వేల గోనె సంచుల బియ్యం పాడైపోయింది. కొన్ని నెలలపాటు వందల పేద కుటుంబాల ఆకలి తీర్చగలిగిన బియ్యం గోడౌన్‌కే పరిమితం చేయడంతో ముక్కిపోయింది. ప్రభుత్వ పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు అందించేందుకు ఉద్దేశించిన ఈ బియ్యాన్ని ఇప్పుడు ‘రీసైకిల్’ చేస్తామని కొందరు అధికారులు పేర్కొన్నట్టు తెలిసింది. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని బలరాంపూర్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. కాగా, ఈ ఘటనపై దర్యాప్తు మొదలైనట్టు సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ బాలేశ్వర్ తెలిపారు.

Tags:    

Similar News