భారీగా నకిలీ పత్తి విత్తనాలు సీజ్
దిశ, ఆదిలాబాద్: మంచిర్యాల జిల్లాలో శుక్రవారం ఏకకాలంలో విత్తన దుకాణాలపై పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. రూ.45 లక్షల విలువైన సుమారు 15 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. 20 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పరారీలో ఉన్న మరో ముగ్గురు నిందితుల కోసం గాలిస్తున్నారు. కన్నేపల్లి, భీమిని, తాండూర్, తాళ్ళగురిజాల, బెల్లంపల్లి , మంచిర్యాల, లక్షేట్టిపేట్, దండేపల్లి, జన్నారం, కోటపల్లి ప్రాంతాల్లో పక్కా సమాచారం సేకరించి పోలీసులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. పొరుగు […]
దిశ, ఆదిలాబాద్: మంచిర్యాల జిల్లాలో శుక్రవారం ఏకకాలంలో విత్తన దుకాణాలపై పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. రూ.45 లక్షల విలువైన సుమారు 15 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. 20 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పరారీలో ఉన్న మరో ముగ్గురు నిందితుల కోసం గాలిస్తున్నారు. కన్నేపల్లి, భీమిని, తాండూర్, తాళ్ళగురిజాల, బెల్లంపల్లి , మంచిర్యాల, లక్షేట్టిపేట్, దండేపల్లి, జన్నారం, కోటపల్లి ప్రాంతాల్లో పక్కా సమాచారం సేకరించి పోలీసులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ నుంచి భారీగా నకిలీ పత్తి విత్తనాలను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు తరలిస్తున్నట్లు నిందితులు వెల్లడించినట్టు పోలీసులు తెలిపారు.