ప్యూన్ ఉద్యోగానికి 15 లక్షల మంది దరఖాస్తు

దిశ, డైనమిక్ బ్యూరో : ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాలకు భారీగా కాంపిటీషన్ పెరిగిపోయింది. ఎలా అయినా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని రాత్రి, పగలు తేడా లేకుండా కళ్లలో వత్తులు వేసుకొని మరీ ప్రిపేర్ అవుతున్నారు. ఇదే విధంగా హైకోర్టులో ప్యూన్ ఉద్యోగానికి అక్కడి ప్రభుత్వం వేసిన నోటిఫికేషన్‌కు ఏకంగా 15 లక్షల మంది అప్లై చేశారు. ఇది చూస్తుంటే.. అక్కడ నిరుద్యోగులు ఎంతమేర ఉన్నారో తెలస్తోంది. పాకిస్తాన్‌లో నిరుద్యోగం వెంటాడుతోంది. ప్రస్తుతం నిరుద్యోగత రేటు 16 శాతానికి […]

Update: 2021-09-29 08:30 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాలకు భారీగా కాంపిటీషన్ పెరిగిపోయింది. ఎలా అయినా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని రాత్రి, పగలు తేడా లేకుండా కళ్లలో వత్తులు వేసుకొని మరీ ప్రిపేర్ అవుతున్నారు. ఇదే విధంగా హైకోర్టులో ప్యూన్ ఉద్యోగానికి అక్కడి ప్రభుత్వం వేసిన నోటిఫికేషన్‌కు ఏకంగా 15 లక్షల మంది అప్లై చేశారు. ఇది చూస్తుంటే.. అక్కడ నిరుద్యోగులు ఎంతమేర ఉన్నారో తెలస్తోంది.

పాకిస్తాన్‌లో నిరుద్యోగం వెంటాడుతోంది. ప్రస్తుతం నిరుద్యోగత రేటు 16 శాతానికి చేరుకున్నట్లు పాకిస్థాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డెవలప్‌మెంట్ ఎకనామిక్స్(PIDE) డేటాలో వెల్లడైంది. అయితే దేశంలో 40 శాతం మంది మహిళా గ్రాడ్యుయేట్లు నిరుద్యోగులుగా మిగిలిపోయారని డేటాలో పేర్కొన్నారు. అంతేకాకుండా కనీసం 24 శాతం మంది విద్యావంతులు నిరుద్యోగులుగా ఉన్నట్లు PIDE వెల్లడించింది. ఈక్రమంలో ఇటీవల ఓ హైకోర్టులో ప్యూన్ స్థానం కోసం నోటిఫికేషన్ ఇవ్వగా.. ఏకంగా 1.5 మిలియన్ మంది అప్లై చేసుకున్నట్లు తేలింది.

G Pay : బంపర్ ఆఫర్.. ఇలా చేస్తే రూ.500 మీవే

Tags:    

Similar News