రెండు రోజుల్లో 125 కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కరోనావైరస్(కోవిడ్ 19) కేసులు భారీగా నమోదవుతున్నాయి. శుక్రవారం, శనివారం.. ఈ రెండు రోజుల్లోనే కొత్తగా 125 మంది కరోనాబాధితులు తేలారు. శుక్రవారం అత్యధికంగా 63 కేసులు నమోదవడం గమనార్హం. శనివారం (సాయంత్రానికి) 62 కొత్త కేసులు వెలుగుచూశాయి. గురువారం రాత్రి 173గా ఉన్న కరోనా కేసుల సంఖ్య శనివారం సాయంత్రానికి 298కి పెరిగింది. మహారాష్ట్రలో అత్యధిక కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ రాష్ట్రంలో కరోనా కేసులు 63కు చేరడంతో ఉద్ధవ్ ఠాక్రే ముంబయి, పూణె, […]

Update: 2020-03-21 08:28 GMT

న్యూఢిల్లీ: దేశంలో కరోనావైరస్(కోవిడ్ 19) కేసులు భారీగా నమోదవుతున్నాయి. శుక్రవారం, శనివారం.. ఈ రెండు రోజుల్లోనే కొత్తగా 125 మంది కరోనాబాధితులు తేలారు. శుక్రవారం అత్యధికంగా 63 కేసులు నమోదవడం గమనార్హం. శనివారం (సాయంత్రానికి) 62 కొత్త కేసులు వెలుగుచూశాయి. గురువారం రాత్రి 173గా ఉన్న కరోనా కేసుల సంఖ్య శనివారం సాయంత్రానికి 298కి పెరిగింది.

మహారాష్ట్రలో అత్యధిక కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ రాష్ట్రంలో కరోనా కేసులు 63కు చేరడంతో ఉద్ధవ్ ఠాక్రే ముంబయి, పూణె, నాగ్‌పూర్ సహా పలునగరాల్లో అత్యవసర సేవలు మినహా అన్ని సేవలను రద్దు చేసిన విషయం తెలిసిందే. 40 కరోనా కేసులతో కేరళ తర్వాతి స్థానంలో ఉన్నది. తెలంగాణలో 21 కేసులు నమోదైనట్టు కేంద్రం గుర్తించింది. కాగా, ఈ వైరస్ బారినపడి నలుగురు మరణించిన విషయం తెలిసిందే. ఇప్పుడు నమోదైన మొత్తం 283 కేసుల్లో విదేశీయులు 39 మంది ఉన్నారు.

Tags: 125 corona positive cases in two days, corona death counts, coronavirus in india

Tags:    

Similar News