సిక్కోలులో విషాదం.. సముద్రంలో వేటకు వెళ్లిన 12 మంది గల్లంతు

దిశ, వెబ్‌డెస్క్: శ్రీకాకుళం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. సముద్రంలో చేపల వేటకు వెళ్లిన 12 మత్య్సకారుల ఆచూకీ గల్లంతు అయ్యింది. జులై 7వ తేదీన చెన్నైలోని కాశిమీడు ఫిషింగ్ హార్బర్ నుంచి మత్య్సకారులందరూ బోటులో వేటకు వెళ్లినట్లు సమాచారం. జులై 16వ తేదీ నుంచి ఎవరితో అందుబాటులో లేకుండా.. ఆచూకీ గల్లంతు అయినట్లు తెలుస్తోంది. విషయం తెలిసిన అధికారులు వారికోసం ఆరా తీయగా, గల్లంతైన మత్య్సకారులు అందరూ సిక్కోలుకు చెందిన వారిగా గుర్తించారు. ఇచ్చాపురానికి చెందిన […]

Update: 2021-07-19 05:35 GMT

దిశ, వెబ్‌డెస్క్: శ్రీకాకుళం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. సముద్రంలో చేపల వేటకు వెళ్లిన 12 మత్య్సకారుల ఆచూకీ గల్లంతు అయ్యింది. జులై 7వ తేదీన చెన్నైలోని కాశిమీడు ఫిషింగ్ హార్బర్ నుంచి మత్య్సకారులందరూ బోటులో వేటకు వెళ్లినట్లు సమాచారం. జులై 16వ తేదీ నుంచి ఎవరితో అందుబాటులో లేకుండా.. ఆచూకీ గల్లంతు అయినట్లు తెలుస్తోంది. విషయం తెలిసిన అధికారులు వారికోసం ఆరా తీయగా, గల్లంతైన మత్య్సకారులు అందరూ సిక్కోలుకు చెందిన వారిగా గుర్తించారు. ఇచ్చాపురానికి చెందిన ఈ మత్య్సకారులంతా ఉపాధి కోసం చెన్నైకి వెళ్లారని వెల్లడించారు. మత్య్సకారులు గల్లంతు అయిన విషయం తెలిసిన వారి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఈ విషయమై స్థానిక మంత్రి అప్పలరాజుకు ఫోన్‌లో సమాచారం అందజేశారు.

Tags:    

Similar News