తీవ్ర విషాదం : బస్ బోల్తా.. 12 మంది మృతి

దిశ, వెబ్‌డెస్క్ : అతివేగంగా వెళ్తున్న బస్సు అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో 12 మంది మృతి చెందారు. ఈ ఘటన ఈశాన్య మెక్సికోలోని తమౌలిపాస్ రాష్ట్రంలోని జాతీయ రహదారిపై జరిగింది. రేనోసా-న్యువోలియోన్ మోంటెర్రేల మధ్య డ్రైవర్ బస్‌ను అతివేగంగా నడపడంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో 9 మంది అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు ఆస్పత్రిలో కన్నుమూశారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు.

Update: 2021-06-15 21:33 GMT

Tags:    

Similar News