ముగిసిన మర్కజ్ యాత్రీకుల క్వారంటైన్

దిశ, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లా నుంచి ఢిల్లీ మర్కజ్‌కు వెళ్లొచ్చిన 11మంది యాత్రికుల క్వారంటైన్ బుధవారంతో ముగిసిందని కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ వెల్లడించారు. వీరి రిపోర్టులు నెగిటివ్ రావడంతో, కరోనా సోకలేదని ధ్రువపత్రం ఇచ్చి ఇళ్లకు పంపించామని తెలిపారు. అలాగే, మరో 14రోజులు హోమ్ క్వారంటైన్‌లో ఉంటామనే హామీ పత్రం తీసుకొని, చేతులపై క్వారంటైన్ స్టాంప్ వేశామని వెల్లడించారు. గడువు పూర్తయి, నెగెటివ్ రిపోర్టులు వచ్చిన వారందరినీ రెండు, మూడు రోజుల్లో రిలీజ్ చేస్తామని స్పష్టం చేశారు. […]

Update: 2020-04-08 10:25 GMT

దిశ, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లా నుంచి ఢిల్లీ మర్కజ్‌కు వెళ్లొచ్చిన 11మంది యాత్రికుల క్వారంటైన్ బుధవారంతో ముగిసిందని కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ వెల్లడించారు. వీరి రిపోర్టులు నెగిటివ్ రావడంతో, కరోనా సోకలేదని ధ్రువపత్రం ఇచ్చి ఇళ్లకు పంపించామని తెలిపారు. అలాగే, మరో 14రోజులు హోమ్ క్వారంటైన్‌లో ఉంటామనే హామీ పత్రం తీసుకొని, చేతులపై క్వారంటైన్ స్టాంప్ వేశామని వెల్లడించారు. గడువు పూర్తయి, నెగెటివ్ రిపోర్టులు వచ్చిన వారందరినీ రెండు, మూడు రోజుల్లో రిలీజ్ చేస్తామని స్పష్టం చేశారు. అనంతరం చించోలి బి మహిళా ప్రాంగణం కేంద్రాన్ని సందర్శించి, అక్కడ చేపట్టిన రక్త నమూనాల సేకరణ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఆయన వెంట ఎస్పీ శశిధర్ రాజు ఉన్నారు.

tags: markaz, delhi, markaz pilgrims, corona, quarantine period, 11 released, nirmal, collector musharraf farooq,

Tags:    

Similar News