‘10th Class సిలబస్.. 50శాతం అమలు చేయాలి’
దిశ, తెలంగాణ బ్యూరో: అకాడమిక్ ఇయర్ తగ్గుతున్న నేపథ్యంలో పదో తరగతిలో సిలబస్‌ను కూడా 50శాతం తగ్గించాలని విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి డిమాండ్ పెరుగుతోంది. మే 17 నుంచి నిర్వహించనున్న పదో తరగతి పరీక్షల్లో 70 శాతం సిలబస్‌ను తీసుకుంటున్నట్టు విద్యాశాఖ ఇప్పటికే ప్రకటించింది. పరీక్షకు సంబంధించిన సిలబస్‌ను 30 శాతం తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే సిలబస్‌ను 50 శాతానికి తగ్గించడం ద్వారా పరీక్షా ప్రక్రియను సరళీకృతం చేయాలని హైదరాబాద్ స్కూల్ పేరేంట్స్ అసోసియేషన్ (హెచ్ఎస్‌పీఏ) […]
దిశ, తెలంగాణ బ్యూరో: అకాడమిక్ ఇయర్ తగ్గుతున్న నేపథ్యంలో పదో తరగతిలో సిలబస్‌ను కూడా 50శాతం తగ్గించాలని విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి డిమాండ్ పెరుగుతోంది. మే 17 నుంచి నిర్వహించనున్న పదో తరగతి పరీక్షల్లో 70 శాతం సిలబస్‌ను తీసుకుంటున్నట్టు విద్యాశాఖ ఇప్పటికే ప్రకటించింది. పరీక్షకు సంబంధించిన సిలబస్‌ను 30 శాతం తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే సిలబస్‌ను 50 శాతానికి తగ్గించడం ద్వారా పరీక్షా ప్రక్రియను సరళీకృతం చేయాలని హైదరాబాద్ స్కూల్ పేరేంట్స్ అసోసియేషన్ (హెచ్ఎస్‌పీఏ) ప్రభుత్వాన్ని కోరుతోంది. అసైన్‌మెంట్స్, సిలబస్ పాఠాలను వీడీయో రూపంలో విద్యార్థులకు అందించాలని అసోసియేషన్ కోరింది. ఫీజు చెల్లించలేదనే కారణంగా విద్యార్థులను పరీక్షలకు దూరం చేయకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అసోసియేషన్ నాయకుడు వెంకట సాయినాథ్ కోరారు. విద్యార్థులను ఏ కారణాలపైన అయినా పరీక్షలు రాయడానికి నిరాకరించే పాఠశాలలపై శిక్షా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.