టెస్టులకు కొత్తగా 106 మంది శాంపిళ్లు..
దిశ, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లాలోని కరోనా పాజిటివ్ వ్యక్తులతో ప్రాథమిక పరిచయాలున్న 106 మంది రక్త నమూనాలను కొవిడ్-19 పరీక్షల కోసం హైదరాబాద్‌కు పంపించామని కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ తెలిపారు. ఆయన జిల్లా కేంద్రంలోని సోఫీ నగర్ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల క్వారంటైన్ కేంద్రాన్ని శుక్రవారం సందర్శించారు. కరోనా సోకిన వ్యక్తులతో సన్నిహితంగా మెలిగిన వ్యక్తులను గుర్తించి, క్వారంటైన్ సెంటర్‌లో ఉంచగా, వారి నమూనాలను హైదరాబాద్ పంపినట్టు వెల్లడించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ […]
దిశ, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లాలోని కరోనా పాజిటివ్ వ్యక్తులతో ప్రాథమిక పరిచయాలున్న 106 మంది రక్త నమూనాలను కొవిడ్-19 పరీక్షల కోసం హైదరాబాద్‌కు పంపించామని కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ తెలిపారు. ఆయన జిల్లా కేంద్రంలోని సోఫీ నగర్ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల క్వారంటైన్ కేంద్రాన్ని శుక్రవారం సందర్శించారు. కరోనా సోకిన వ్యక్తులతో సన్నిహితంగా మెలిగిన వ్యక్తులను గుర్తించి, క్వారంటైన్ సెంటర్‌లో ఉంచగా, వారి నమూనాలను హైదరాబాద్ పంపినట్టు వెల్లడించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ ఎ.భాస్కర్ రావు, అదనపు ఎస్పీ వెంకట్ రెడ్డి, డీఎంహెచ్‌వో డాక్టర్ వసంతరావు, ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ దేవేందర్ రెడ్డి, కరోనా నియంత్రణ జిల్లా నోడల్ అధికారి డాక్టర్ కార్తీక్, తదితరులు ఉన్నారు.
Tags: : samples for corona test, blood samples, collector musharraf farooqi, nirmal, corona test, sofi nagar, dmho vasantha rao